డైలీ అందరూ తాగుతున్న కూల్ డ్రింక్స్ తో టాయిలెట్ సీట్ మురికి ఇట్టే వదులుతుంది..

Publish Date:Aug 7, 2025

Advertisement

 


టాయిలెట్ సీట్.. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చాక ఇంట్లో అందరూ ఒకే సీటు మీద కూర్చుని టాయిలెట్ వెళ్లడం తప్పనిసరి. అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత శుభ్రం చేస్తున్నా టాయిలెట్ సీట్ తొందరగా మురికిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా టాయిలెట్ శుభ్రంగా లేకపోతే వచ్చినవారు చాలా అసహ్యించుకుంటారు. అయితే టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను కేవలం 10 రూపాయల విలువ చేసే పానీయంతో సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా కూల్ డ్రింక్ అంటే షాకయ్యేవారు ఎక్కువ. కానీ దీని వెనుక నిజాలు తెలుకుంటే..

కూల్ డ్రింక్..

వేసవి కాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేస్తాయి అనే విషయం పక్కన పెడితే.. టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను మాత్రం అద్భుతంగా క్లీన్ చేస్తాయి.

నిజానికి కూల్ డ్రింక్స్ లో  కార్బోనిక్ ఆమ్లం,  ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటాయి. ఈ ఆమ్లాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవి టాయిలెట్ సీటుపై ఉన్న మొండి మరకలు,  ధూళిని సులువుగా కరిగిస్తాయి . దీని కారణంగా మురికిగా ఉన్న టాయిలెట్‌ను శుభ్రం చేయడం సులభం. దీన్ని ఉపయోగించడం వల్ల శుభ్రపరిచేటప్పుడు  ఎక్కువ శ్రమ పడనవసరం లేదు.

ఎలా క్లీన్ చేయాలి..

కూల్ డ్రింక్స్ ను ఉపయోగించి టాయిలెట్ ను క్లీన్ చేయడానికి కూడా పెద్ద యుద్దం చేయాల్సిన పని లేదు.  టాయిలెట్ సీట్ పైన ఎక్కడెక్కడ మురికి ఎక్కువ కనిపిస్తోందో.. అక్కడ కూల్ డ్రింక్ ను కాస్త ఎక్కువ పోయాలి. మిగిలిన ప్రాంతంలో సాధారణంగా వేస్తే సరిపోతుంది.  ఇలా పోసిన తరువాత దాన్ని ఒక 15 లేదా 20 నిమిషాలు అలాగే వదిలేయాలి.  కూల్ డ్రింక్ లో ఉండే ఆమ్లం చర్య జరిపి మురికి, మరకలు మొదలైనవాటిని కరిగిస్తుంది.  15 నిమిషాల తరువాత టాయిలెట్ బ్రష్ తీసుకుని స్ర్కబ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేశాక నీళ్ళు పోసి కడిగితే సరిపోతుంది.  ఇలా చేస్తే టాయిలెట్ కొత్త దానిలా మెరిసిపోతుంది కూడా.  అయితే కూల్ డ్రింక్ లోని తీపి బాగా పోయేలా కాస్త నీరు ఎక్కువ వినియోగిస్తే సరిపోతుంది.

 టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా  ఉండటానికి, నిమ్మ తొక్క, ఉప్పు,  నీటిని కలిపిన ద్రావణాన్ని టాయిలెట్‌లో పోయాలి.

ఓడోనిల్ వంటి ఉత్పత్తులకు బదులుగా, మీరు నిమిషాల్లో దుర్వాసనను తొలగించడానికి  డిఫ్యూజర్‌ను ఉపయోగించవచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా.. టాయిలెట్ లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, టాయిలెట్ లో వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువులు ఉంచడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా ఉంటుంది.

                                  *రూపశ్రీ.
 

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.