మంత్రి మేకపాటి మృతికి అసలు కారణం ఇదేనా?
Publish Date:Feb 21, 2022
.webp)
Advertisement
ఆరడుగుల ఆజానుబాహుడు. హాండ్సమ్. ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంటారు. రెగ్యులర్‌గా జిమ్ చేస్తుంటారు. వయసు కూడా మరీ పెద్దదేమీ కాదు. 50 ఏళ్లు అంతే. ఆయన్ను చూస్తే.. ఆ అంత ఏజ్ ఉన్నట్టు కూడా కనిపించరు. అలాంటి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంత సడెన్‌గా చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. అంతటి గట్టి శరీరం ఉన్న ఆయన.. అలా ఎలా చనిపోయాడనే చర్చ నడుస్తోంది.
గౌతమ్‌రెడ్డికి మద్యం, దూమపానంలాంటి అలవాట్లు లేవంటున్నారు. వారం పాటు దుబాయ్‌లో ఉండి వచ్చారు. నెల క్రితం రెండోసారి కొవిడ్ బారిన పడ్డారు. అంతకుముందు ఓసారి కరోనా సోకింది. బయటకు చూస్తే.. హెల్దీగానే ఉన్నారు. కానీ, రెండుసార్లు కొవిడ్ అటాక్ కావడంతో.. ఇంటర్నల్‌గా బాడీ డ్యామేజ్ అయుంటుందని అంటున్నారు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరిగుంటుందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు.
కరోనా సోకిన వారు తిరిగి కోలుకున్నా.. వారిలో రక్తం చిక్కబడటం లాంటి సమస్యలు వస్తున్నాయి. అలా రక్తం చిక్కబడితే గుండెపోటు వచ్చే అవకాశం అధికం. ప్రస్తుతం మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతోనే మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. తమ ఆసుపత్రికి వచ్చే సరికి ఆయన శరీరం స్పందించడం లేదని.. ఆయన్ను కాపాడటానికి చాలా శ్రమించినా.. ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు.
ఇక, 50 ఏళ్ల వయసుకే హార్ట్ స్ట్రోక్ రావడం.. అదికూడా ఆరోగ్యంగా ఉండి.. రెగ్యులర్‌గా వ్యాయామం చేసే వ్యక్తికి.. ఇలా సడెన్ స్ట్రోక్ రావడానికి కారణం.. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ కావొచ్చని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/reasons-behind-mekapati-goutham-reddy-death-25-132064.html












