Publish Date:Jan 18, 2026
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ర రెడ్డి కమలం గూటికి చేరుతాడంటూ గత ఐదారు నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోవడమ లాంఛనమేననీ, అయితే మిథున్ రెడ్డి కంటే ముందు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కూడా కమలం కండువా కప్పుకుంటారనీ గట్టిగా వినిపించింది. అయితే ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇంతలో విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం మొదలైంది. ఆ మాట స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారు.
అది పక్కన పెడితే మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి ఆటంకమేంటి? అన్న చర్చ ఆరంభమైంది. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో అత్యంత కీలకమైన నేత. మిథున్ రెడ్డికి 2014- 24 మధ్య 500 శాతానికిపైగా ఆస్తుల పెరుగుదల ఏమంత సులువుగా జరగలేదు. జగన్ కి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి. సరిగ్గా అదే సమయంలో జగన్ హయాంలో ఆయన కేబినెట్ లో పెద్దిరెడ్డి చాలా ముఖ్యుడు. భారీ ఎత్తున భూకబ్జాలు, అటవీ భూముల ఆక్రమణలు, ఆపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు యధేచ్చగా సాగాయనీ, తండ్రీ కొడుకులు పెద్దరెడ్డి, మిథున్ రెడ్డిలు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్న మరక ఉన్నందున మిథున్ రెడ్డి ఎంట్రీ విషయంలో బీజేపీ ముందువెనుకలాడుతోందని పరిశీలకులు అంటున్నారు.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు. ఇంతకీ బీజేపీ పెట్టిన కండీషన్స్ ఏమిటంటే.. మిథున్ రెడ్డి బీజేపీ గూటికి చేరిన తరువాత ఇక జగన్ తో ఎటువంటి సంబధాలూ ఉండకూడదు. లోపాయికారీ ఒప్పందాలేవీ చేసుకోకూడదు. ఈ కండీషన్స్ కారణంగానే మిథున్ రెడ్డి బీజేపీలో చేరికకు బ్రేక్ పడిందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులను కూడా తీసుకురావాలని బీజేపీ షరతు విధించిందనీ, అది కూడా మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీ జాప్యం కావడానికి కారణమంటున్నారు.
ఇప్పటికే వైసీపీలో కొందరు సీనియర్లు.. సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయారు. అలాంటి వారితో కలసి మిథున్ బీజేపీలోకి వస్తే.. ఏపీలో కూడా పార్టీ బలపడుతుంది. కాబట్టి.. అలా చేయగలిగితే తమకేం అభ్యంతరం లేదని కేంద్ర కమలనాయకత్వం భావిస్తోందట. దీంతో ఇటు మిథున్ తో పాటు అటు విజయసాయి కూడా ఇలాంటి కమలం బాట పట్టే వారి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారట. దీంతో మిథున్ బీజేపీ ఎంట్రీకి జాప్యం అవుతోందనీ, బీజేపీ కండీషన్లన్నిటినీ నెరవేర్చి మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్లేలోపు 2029 ఎన్నికలు కూడా వచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-for-mithunredd-entry-into-bjp-25-212693.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.