Publish Date:Jan 19, 2026
ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులోపలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడి, రెండు రోజుల కిందట వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా వైసీపీకి చెందిన మరో ఎంపీకి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో మనీ ల్యాండరింగ్ చేశారనీ, ఆ సొమ్ము కీలక వ్యక్తుల వరకూ చేరిందని ఈడీ అనుమానిస్తోంది.
జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలకంగా భావి స్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టత కోసం ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులను విచారించిన ఈడి, తాజాగా ఎంపీ స్థాయి నేతకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్నదని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి విచారణ లో కొత్త ఆధారాలు వెలుగు లోకి వచ్చే అవకాశ ముందం టున్నారు. మనీ ట్రయిల్‌పై ఈడి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ పరిణా మాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతు న్నాయి. మిథున్ రెడ్డి ఈడి విచారణకు ఎలా స్పందిస్తారన్నది, విచార ణలో ఏమి బయటపడ నున్నదని, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-notices-to-ycp-mp-mithunreddy-25-212701.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.