పవార్ బిగ్ డెసిషన్ మతలబు ఏమిటి?

Publish Date:May 3, 2023

Advertisement

ఎన్సీపీ వ్యస్థాపక అధ్యక్షుడు, శరద్‌ పవార్‌ రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అదే ఆయన తుది నిర్ణయమా లేక మనసు మార్చుకునే అవకాశం వుందా అనే విషయంలో ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేక పోయినా, కొత్త అధ్యక్షుని ఎంపికకు సంబంధించి ఒక ప్రణాలికను సిద్ధం చేసేందుకు పార్టీ ముఖ్యనేతలతో స్వయంగా పవార్ ప్రకటించిన కమిటీ కసరత్తు ప్రారంభించింది. వారసుని ఎంపిక ప్రకియ మొదలైంది. 

ఈ నేపధ్యంలో, శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అందులో సందేహం, లేదు. అయితే  శరద్ పవార్ ఇంత సడన్ గా ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారు? శరద్ పవార్ సమీప బంధువు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పినట్లుగా కేవలం వయసు రీత్యానే పవార్ పక్కకు తప్పుకున్నారా? లేక.. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, రాజ్యసభ ఎంపీ, సంజయ్ రౌత్ అనుమానించిన విధంగా, శరద్ పవార్ బిగ్ డెసిషన్ వెనక ఇంకా ఏదైనా మతలబు ఉందా అనేది తెలియవలసి వుంది.

అంతే కాదు, సంజయ్ రౌత్ శరద్ పవార్ నిర్ణయంతో మహరాష్ట్ర రాజకీయలలోనే కాదు, జాతీయ రాజకీయలోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. అన్నిటి కన్నా ముఖ్యంగా  పవార్ ప్రకటనకు చాల ముందుగా, ఏప్రిల్ 19న  పవార్ కుమార్తె సుప్రియా సూలే, 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు (భూకంపాలు) వస్తాయని చెప్పారు. ఆమె ఈ మాట చెప్పిన 13వ రోజే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 24 ఏళ్లపాటు ఆయన ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సుప్రియ చెప్పిన రెండో భూకంపం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

 అదలా ఉంటే, శరద్ పవార్ వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, సమీప బంధువు అజిత్‌ పవార్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి పేర్లను పార్టీ సీనియర్‌ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ సిఫార్సు చేశారు. వీరిలో పార్లమెంట్‌ సభ్యురాలైన సుప్రియాను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని, అదే సమయంలో రాష్ట్ర బాధ్యతలను అజిత్‌కు అప్పగించాలని పేర్కొన్నారు.ఇదే అంతిమ నిర్ణయం అవునా  కాదా అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోతుందని అంటున్నారు. అలాగే,  సుప్రియా సూలే, చెప్పిన రెండో భూకంపం ఏంటనేది కూడా ఒకటి రెండు రోజుల్లోనే తెలిపోతుందని, పార్టీ నేతలు పేర్కొంటున్నారు.  

నిజానికి అజిత్ పవార్‌ బీజేపీతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగిన నేపధ్యంలో మొదలైన  పవార్ బిగ్ డెసిషన్  ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పవార్, వ్యూహాత్మకంగా పావులు కదిపి అజిత్ పవార్ కు చెక్ పెట్టారా? లేక... అనే  అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత కొంత కాలంగా శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.ఈ నేపధ్యంలో ఏమి జరిగినా  ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.  ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. నిజానికి పవార్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదని సో.. పవార్ నెక్స్ట్ మువ్’ పై బెట్ కట్టడం అంట క్షేమం కాదని అంటున్నారు.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.