నా దారి రహదారి.. రజనీ

Publish Date:May 3, 2023

Advertisement

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ ఏది మాట్లాడినా స్పష్టంగా సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా బెజవాడ వేదికగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించి చెప్పిన మాటలు దానిపై వైసీపీ వర్గాల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే.. విమర్శలను పట్టించుకోననీ, తాను ఏమనుకున్నానో అదే చెప్పానని అన్నారు. నిజమే.. రజనీకాంత్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా హృదయపూర్వకంగానే చెబుతారు. హృదయపూర్వకంగానే మాట్లాడతారు.

అందుకే ఆయన వివాదరహితుడిగా దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో  సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక ఆయన సినిమాలో ఓ డైలాగ్ ఉంది..  ఒక  సారి  చెపితే వంద సార్లు చెప్పినట్లే.. అని.. అది కేవలం సినిమాలకే పరిమితం కాదు.. నిజజీవితంలో కూడా రజనీకాంత్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. తాను మనసా వాచా కర్మణా నమ్మితే తప్ప ఆయన మాట్లాడరు.  ఒకప్పడు  ఆయన రాజకీయ అరంగేట్రం గురించి, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అభిమానుల అభిప్రాయ సేకరణ పేరిట  తమిళనాడులో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. నిజానికి ఒక దశలో ఆయన   ప్రత్యక్ష రాజకీయాల్లోన ఒక కాలు పెట్టారు కూడా. సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించారు.  అయితే రాజకీయాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకున్నాననీ, అందుకే తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించేశారు.  రాజకీయ అరంగేట్రం చేయకుండానే, శుభం కార్డు వేశారు.

ఆ తర్వాత ఆయన సైలెంటై పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల గురుంచి ఆయన ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రాజకీయాలలో ఉన్న వారిలో ఆయనకు మిత్రులు ఉన్నారు. తనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మిత్రుల గురించి ఒక మంచి మాట చెప్పడానికి రజనీకాంత్ ఎప్పుడూ వెనుకాడరు. ఎవరో ఏదో అనుకుంటారనీ, అంటారనీ ఆయన బెదరడు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినా.. అంతకు ముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందని పేర్కొన్నా.. ఆయన తాను ఏది అనుకున్నారో, ఏది నమ్మారో అదే చెప్పారు. వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తనకు నచ్చలేదనీ, అలా చేయడం ద్వారా ఆయనకు అన్యాయం జరిగిందని కుండబద్దలు కొట్టేశారు.

అయితే రజనీ అభిప్రాయంతో వెంకయ్యనాయుడిని అభిమానించే వారే కాదు.. రాజకీయాల గురించి కొద్ది పాటి జ్ణానం, అవగాహన ఉన్న ఎవరైనా ఏకీభవిస్తారు.   వెంకయ్యకు అన్యాయం జరిగిందన్న తన వ్యాఖ్యలు బీజేపీ వారిని నొప్పిస్తాయని తెలిసినా రజనీ వెనుకాడలేదు. తన మనసులో మాట చెప్పేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన వ్యాఖ్యలు వైసీపీకి రుచించవని తెలిసినా తన మనసులో మాట బయటపెట్టడానికి రజనీకాంత్ వెనుకాడలేదు.

తాను నమ్మిన విషయాన్ని చెప్పడానికి ఆయన ఇసుమంతైనా సందేహించలేదు.  అందుకే తన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలను ఆయన లెక్క చేయడం లేదు. ఏదో సామెత చెప్పినట్లు అటువంటి వ్యాఖ్యల వల్ల తన గౌరవానికి ఇసుమంత కూడా భంగం కలగదని ఆయనకు తెలుసు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.