Jr NTR కార్యాలయం కీలక ప్రకటన..!

Publish Date:Jul 14, 2026

Advertisement

 

నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ 'RAW NTR (రా-ఎన్టీఆర్)' పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ, అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసి, ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగు తున్న 'ఊరు-వాడ' సేవా కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని, రా-ఎన్టీఆర్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా తమ ఆధ్వర్యంలో జరుగుతోందని, ఎన్టీఆర్ ప్రజాసేవ కోసం రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని చేపడుతున్నారని, రాజకీయ అరంగేట్రంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రారంభమవుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ ప్రచారంపై పలు ఫిర్యాదులు అందడంతో స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం, రా-ఎన్టీఆర్ అనే సంస్థకు, దాని కార్యకలాపాలకు, నిర్వాహకులకు తమతో ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతి నిధ్యం వహించే అధికారం లేదని, ఆయన పేరుతో ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసే హక్కు కూడా లేదని వెల్లడించింది. అలాగే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం లేదా అధికారిక సమాచారం అయినా ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని, అనధికార వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కార్యాలయం ప్రజలకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

ఈ అంశంపై ఇదే తమ చివరి ప్రకటన అని పేర్కొన్న ఎన్టీఆర్ కార్యాలయం, మీడియా, సోషల్ మీడియా వేదికలు, అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, పుకార్లను విశ్వసించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఈ ప్రకటనతో 'రా-ఎన్టీఆర్' పేరుతో జరుగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా స్పష్టత వచ్చినట్లైంది.

By
en-us Political News

  
టీటీడీ ధర్మకర్తల మండలి దాతలకు కల్పించే దర్శన సౌకర్యాలు, నిబంధనలను హేతుబద్ధీకరిస్తూ కీలక ప్రకటన చేసింది.
అమెరికా వైమానిక దళం గ్రేటర్ టున్బ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్రూజ్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు క బాంబుల వర్షం కురిపించాయి. మొదటి విడత దాడి దాదాపు గంటన్నర సేపు సాగింది. అనంతరం, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు అమెరికా నావికా, వైమానిక దళాలు రెండో విడత దాడులకు పాల్పడ్డాయి.
మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే ఈ బోనాల ఉత్సవాల శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల పండుగ ఒక ఉత్సవం మాత్రమే కాదనీ, అది సమాజంలో విభిన్న వర్గాల మధ్య ఐక్యతను, సహోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.