కరీంనగర్ లో పునుగుపిల్లి
Publish Date:Dec 14, 2025
Advertisement
తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగుపిల్లి తెలంగాణలోని కరీంనగర్ లో దర్శనమిచ్చింది. సాధారణంగా దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన క్షీరజం మైదాన ప్రాంతంలో కనిపించడం విస్మయం గొలిపింది. కరీంనగర్ లోని హిందుపురి కాలనీలో ఆదివారం (డిసెంబర్ 14) ఓ వ్యక్తి ఇంట్లో పునుగుపల్లి కనిపించింది. వెంటనే ఆ ఇంటి యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఈ పునుగుపిల్లిని క్షేమంగా పట్టుకుని డీర్ పార్క్ కు తరలించి వైద్యం అందించారు. అది పూర్తిగా కోలుకున్న తరువాత దానిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శేషాచలం కొండల్లో మాత్రమే అధికంగా కనిపించే పునుగుపిల్లి తైలాన్ని తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఉపయోగిస్తారు. అలాగే ఈ పునుగు పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారుచేసే కోపి లువాక్' కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రసిద్ధి చెందింది.
http://www.teluguone.com/news/content/rare-punugupilly-in-karimnagar-36-210989.html





