శ్రీవారికి విరాళాలిచ్చేభక్తులకు టీటీడీ అందించే సౌకర్యాలేంటో తెలుసా?
Publish Date:Dec 15, 2025
Advertisement
తిరుమల వెంకటేశ్వర స్వామివారికి రూ. 1లక్ష నుంచి.. రూ.1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందజేస్తున్నది. తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన,వసతి, ప్రసాదం వంటి పలు అవకాశాలను కల్పిస్తోంది. విరాళం మొత్తాన్ని బట్టి భక్తులకు అందే సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి. 1లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులు, ఆ విరాళానికి సంబంధించిన నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువీకరణ పత్రం,1 రోజు ఐదుగురికి సుపథం దర్శనం, అలాగే వంద రూపాయల టారిఫ్ ఒక రోజు వసతి కల్పించడంతో పాటు, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ టీటీడీ ఇస్తుంది. అలాగే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక ఏడాదిలో 3 రోజులు ఐదుగురికి సుపథం దర్శనం, వంద రూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఇక 10లక్షల రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే వారికి నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఏడాదిలో మూడు రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం, అలాగే వెయ్యిరూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ తో పాటు 50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం టీటీడీ అంద జేస్తుంది. అలాగే పాతిక లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు ధృవీకరణతో పాటు , ఏడాదిలో ఒక రోజు ఐదుగురికి మందికి సుపథం దర్శనం, 3 రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం, 1500 రూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ టీటీడీ అందిస్తుంది. ఇక పోతే.. 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయల విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ + పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక రోజు సుప్రభాత సేవ, 5 గురికి రెండు రోజులు సుపథం దర్శనం, ఐదుగురికి, మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి రూ.2000 టారిఫ్‌తో మూడు రోజుల వసతి, 10 చిన్న లడ్డూలు, పది పెద్ద లడ్డూలు, పది మహా ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందిస్తుంది. ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు, రెండు రోజులు సుప్రభాత సేవ-, ఐదుగురికిమందికి, 3 రోజులు సుపథం దర్శనం- ఐదుగురికి 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి రూ.2500 టారిఫ్‌తో 3 రోజుల వసతి, 8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెంతో పాటు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందజేస్తుంది. కోటి రూపాయలు అంత కన్నా ఎక్కువ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, పన్నుమినహాయింపు దృవీకరణ, ఏడాదిలో 3 రోజులు ఐదుగురికి సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి నాణెం, దుపట్టా, జాకెట్ పీస్ సహా పలు అదనపు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది.
http://www.teluguone.com/news/content/do-you-know-the-facilities-to-donors-36-211016.html





