హైకోర్టుకు హైడ్రా రంగనాథ్ వివరణ!
Publish Date:Sep 30, 2024
Advertisement
హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరుకానున్నారు. అమీన్ పూర్ లో హాస్పిటల్ కూల్చివేత పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు హైకోర్టుకు వర్చువల్ గా హాజరై వివరణ ఇచ్చారు. హాస్పిటల్ కూల్చివేతపై సీరియస్ అయిన హైకోర్టు ప్రశ్నిస్తూ.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. కాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం శ్రీకృష్ణానగర్‌లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసిల్దార్, హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఉత్తర్వుల ఉల్లంఘనపై తహసిల్దార్, హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ వర్చువల్ గా హైకోర్టు ఎదుట హాజరయ్యారు.
http://www.teluguone.com/news/content/ranganath-explanation-to-high-court-25-185900.html





