తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ కార్తల ధర్నా
Publish Date:Sep 30, 2024
Advertisement
తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మంత్రి కొండాసురేఖ మీద అసభ్యకర పోస్టులను బిఆర్ఎస్ సోషల్ మీడియా విడుదల చేసిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కెసిఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్దం చేసే ప్రయత్నం చేయగా బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులను అడ్డుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకోవల్సి వచ్చింది. తనపై బిఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తుందని మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కెటీఆర్ ఖబడ్దార్ అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. మీడియా సమావేశంలో కొండా సురేఖ కంటతడి పెట్టారు. కెటీఆర్ కు మహిళలంటే చులకన భావమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-dharna-at-telangana-bhavan-25-185906.html
http://www.teluguone.com/news/content/congress-dharna-at-telangana-bhavan-25-185906.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





