సీట్ల కోసం పాశ్వాన్-జితన్ రామ్ మంజీ ఫైట్
Publish Date:Sep 9, 2015
Advertisement
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నానాటికీ రాజకీయ పార్టీలలో లుకలుకలు పెరిగిపోతున్నాయి. జనతా పరివార్ నుండి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ బయటకు వెళ్లిపోయి ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన్ని వెనక్కి తిరిగి రప్పించేందుకు లాలూ, నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీకి, రామ్ విలాశ్ పాశ్వాన్ కి మధ్య సీట్ల పంపకాలలో గొడవలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగుతున్న రామ్ విలాశ్ పాశ్వాన్ తన లోక్ జన శక్తి పార్టీకి 75 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. జితన్ రామ్ మంజీ కూడా తను కొత్తగా స్థాపించిన హిందుస్తానీ అవామీ మోర్చా లో ఉన్న 19మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించాలని ఇంకా అదనంగా మరికొన్ని సీట్లు కూడా కేతాయిన్చాలాని పట్టుబడుతున్నారు. తమ పార్టీకి తగినన్ని సీట్లు రాకుండా పాశ్వాన్ అడ్డుపడుతున్నారని జితన్ రామ్ మంజీ ఆరోపిస్తున్నారు. "దళితుల సమస్యల గురించి ఏనాడు మాట్లాడని పాశ్వాన్ తను దళిత ప్రతినిధినని చెప్పుకొంటూ ఏకంగా 75 సీట్లు కోరడం చాలా విచిత్రంగా ఉంది. అసలు లోక్ జన శక్తి పార్టీ ఇంతవరకు ఒక్క స్థానంలో గెలవలేకపోయింది. పాశ్వాన్ కోసం మా పార్టీని పక్కనబెడితే ఎన్డీయే కూటమికే నఃస్తం కలుగుతుంది,” అని జితన్ రామ్ మంజీ బీజేపీ అధిష్టాన్ని హెచ్చరించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు తమ ఎన్డీయే కూటమిలో ఇటువంటి గొడవలు మొదలవడంతో బీజేపీ అధిష్టానం వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈసారి బీహార్ ఎన్నికలలో బీజేపీ-జనతా పరివార్ దానితో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ, వామపక్ష కూటమిని, ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎదుర్కొని విజయం సాధించాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/ramvilas-paswan-45-49885.html





