రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ విందు
Publish Date:Dec 13, 2025
Advertisement
హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఘనస్వాగతం పలికారు. భోజనం సందర్భంగా కేటీఆర్, అఖిలేశ్ యాదవ్ కేఫ్ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్ అభినందించారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను ఇంత విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజమాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. రామేశ్వరం కేఫ్‌లో లంచ్ కార్యక్రమం ముగిసిన అనంతరం, అఖిలేష్ యాదవ్ మరియు కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.
http://www.teluguone.com/news/content/rameshwaram-cafe-36-210951.html





