కేవీపీ బిల్లు అడ్డుకోవడానికి బీజేపీ వ్యూహం...!

Publish Date:May 12, 2016

Advertisement

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రేపు ఓటింగ్ జరగనుంది.  షెడ్యూల్ ప్రకారం రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు, రేపు జరిగే ఓటింగ్ "చావో రేవో" కిందే లెక్క. ఇప్పటికే ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసిన దరిమిలా, కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖుంగా తెరపైకి తెచ్చింది. అందుకే ఈ ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్ ఇంపార్టెన్స్‌ ఇచ్చింది. వ్యూహత్మకంగా రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్‌దే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై కేవీపీ బిల్లు చర్చకు వస్తే..ఆ తరువాత జరిగే ఓటింగ్‌లో సంఖ్యాబలం లేని బీజేపీ ఓటమిని  ఒప్పుకోవాలి.

 

రాజ్యసభలో ఈ బిల్లు పాసైనా..లోక్‌సభలో బీజేపీ బలం ముందు కాంగ్రెస్ తలవంచక తప్పదు. కాని ఇక్కడే ఉంది కాంగ్రెస్ మైండ్ గేమ్..లోక్‌సభలోకి బిల్లు వస్తే దానిపై చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రధాని మోడీ స్వయంగా బిల్లుపై మాట్లాడాలి. హోదాకు మేం ఒప్పుకుంటున్నాం అంటే ఓకే..! అలా కాక ఇవ్వడం కుదరదు అంటే మాత్రం ఏపీలో బీజేపీ గల్లంతే. ఇప్పటి వరకు హోదా ఇవ్వడం సాధ్యపడదు అని తన మంత్రుల చేత చెప్పిస్తున్న మోడీ ఇంతవరకు దీనిపై అధికారికంగా మాట్లాడలేదు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడక తప్పదు. అప్పుడు మోడీ హోదాకు వ్యతిరేకమో..అనుకూలమో చెప్పాలి. దాని కోసమే కాంగ్రెస్ ప్లాన్. హోదా ఇచ్చినా కాంగ్రెస్‌కే ప్లస్..ఇవ్వకపోయినా కాంగ్రెస్‌కే ప్లస్. ఈ ప్లాన్‌ను అర్థం చేసుకున్న బీజేపీ అధినాయకత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

 

దీనిని ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచించిన బీజేపీ వ్యూహకర్తలు రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేయాలని వ్యూహన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే నిర్దేశిత సమయం కంటే రెండు రోజులు ముందుగానే లోక్‌సభను వాయిదా వేసిన కేంద్రం..ఓ రోజు ముందుగానే రాజ్యసభను వాయిదా వేయాలని స్కెచ్ గీస్తోంది. ఇవాళ రాజ్యసభ నిరవధిక వాయిదా పడితే..రేపు సభ ముందుకు రానున్న కేవీపీ బిల్లు..తదుపరి సమావేశాల్లో కాని సభలో ప్రస్తావనకు రాదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం నుంచి తప్పించుకునేందుకు నరేంద్రమోడీకి ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.

 

ఇప్పుడైతే తప్పించుకున్నారు అనుకుందాం.. కాని వచ్చే సమావేశాల్లో ఏం చేస్తారు అని మీకు డౌట్ రావొచ్చు. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది..ప్రస్తుతం రాజ్యసభలో 57 మంది సభ్యుల పదవీ కాలం రేపటితో ముగియనుంది. వారి స్థానంలో బీజేపీ తో పాటు ఎన్‌డీఏ మిత్రపక్షాలకు చెందిన పలువురు సభ్యులు ఎన్నికవుతారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలను బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలే పరిపాలిస్తున్నాయి. తద్వారా బీజేపీ బలం కూడా పెరగనుంది. రాజ్యసభలో తన బలం పెరిగిన తర్వాత జరగనున్న తదుపరి సమావేశాల ముందుకు ఈ బిల్లు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని కమలనాథుల భావన. దీనిని బట్టి బీజేపీ ఏ రకంగానూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయించకున్నట్లుంది.
 

By
en-us Political News

  
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.