రాజు చచ్చాడా? చంపేశారా? అంతా అనుమానాస్పదం..!
Publish Date:Sep 16, 2021
Advertisement
సైదాబాద్ బాలిక హంతకుడు రాజు రైల్వేట్రాక్‌పై చచ్చిపడున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. మృతిడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా చనిపోయింది రాజునే అని పోలీసులు ధృవీకరిస్తున్నారు. అయితే, బాలిక పేరెంట్స్ మాత్రం మృతదేహాన్ని తమకు చూపించాలని.. తాము కన్ఫామ్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగా.. లేటెస్ట్‌గా రాజు తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన కొడుకు 3 రోజుల కిందటే దొరికాడని.. పోలీసులే ఉరికించి చంపేశారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన పులికొండ రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఘటనపై నిందితుడి తల్లి వీరమ్మ అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులే తన కొడుకుని ఉరికించి ఉరికించి చంపేశారని ఆరోపించింది. ‘‘నా కొడుకు రాజు 3 రోజుల కిందటే రైల్వేస్టేషన్‌లో పోలీసులకు దొరికాడు. రాజును ఎన్‌కౌంటర్ చేయాలని, పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాం. నిన్న మొత్తం మా వివరాలన్నీ రాసుకున్నారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదు. నిన్న ఒక్కసారిగా అందరూ వచ్చారు. అప్పుడే మాకు డౌట్ వచ్చి అడిగితే దొరకలేదన్నారు. మిమ్మల్ని వదిలేస్తున్నాం అని నిన్న రాత్రి 10 గంటలకు ఉప్పల్‌లో వదిలిపెట్టారు. పోలీసులే నా కొడుకును ఉరికించి చంపేశారు. వాళ్లకు 3 రోజుల కిందటే దొరికినా ఈ రోజు మమ్మల్ని ఇటు పంపించి వాడిని అటు చంపేశారు.’’ అంటూ రాజు తల్లి వీరమ్మ సంచలన కామెంట్లు చేసింది. మరోవైపు రాజు సూసైడ్ చేసుకున్న సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ తరుణ్ జోష్ పలు వివరాలు చెప్పారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య.. స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. మొహం గుర్తుపట్టలేనంతగా ఉందని, అయితే చేతిపై టాటూ, మనిషి పొడుగు అన్నీ సరిపోయాయన్నారు. రాజు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారన్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని సీపీ స్పష్టం చేశారు. ఇక్కడికి ఎలా, ఎప్పుడు వచ్చాడు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నది విచారణ జరుపుతున్నామన్నారు. సీపీ కెమెరాలు పరిలీస్తామని చెప్పారు. గురువారం ఉదయం 8:45 గంటలకు కోరార్క్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుందని.. అదే సమయంలో రాజు ట్రాక్‌పై నడుచుకుంటు వెళుతుండగా రైల్వే సిబ్బంది చూసి పట్టుకోడానికి ప్రయత్నించారని.. సాధ్యంకాలేదని, ట్రైన్ కింద పడి నిందితుడు రాజు చనిపోయాడని సీపీ తరుణ్ జోష్ వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/raju-mother-suspects-her-son-death-25-123064.html





