నూతన సీఐసీగా రాజ్‌కుమార్ ప్రమాణ స్వీకారం
Publish Date:Dec 15, 2025
Advertisement
నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాజ్‌కుమార్‌తో పాటు మరో 8 మందిని సమాచార కమిషనర్లుగా సిఫార్సు చేశారు. 9 ఏళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంలో పనిచేయనుంది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ రాజ్‌కుమార్ గోయల్ పేరును ప్రతిపాదించింది. రాజ్‌కుమార్ గోయల్ 1990 బ్యాచ్ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. హోం శాఖలో కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ)గా కూడా పనిచేశారు. కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్‌లోనూ కీలక పదవులను నిర్వహించారు.
http://www.teluguone.com/news/content/rajkumar-goyal-36-211012.html





