కోస్తాలో వానలు.. రాయలసీమలో భానుడి భగభగలు.. విలక్షణంగా ఏపీలో క్లైమేట్!

Publish Date:Mar 16, 2026

Advertisement

వాతావరణ మార్పు.. రాష్ట్రంలో  ఒకే సమయంలో ఒక ప్రాంతంలో  ఎండ, మరో ప్వారాంతంలో వాన  విస్మయం, ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విలక్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతం వానలు, మరో ప్రాంతం భానుడి భుగభగలతో  నిప్పుల గుండాన్ని తలపిస్తోంది.   ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు భిన్న వాతావరణం ఉంది.  ఇక వివరాల్లోకి వెడితే..  రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే ఎండలు మండిపోతున్నాయి.  

అనంతపురం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం (మార్చి 16) జిల్లాలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడి, ఉక్కపోతతో సీమ జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  మార్చి ఆరంభంలోనే.. అంటే వేసవి మొదటిలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుంటే రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు ఇంకెంత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇదే సమయంలో కోస్తా జిల్లాలలో వాతావరణం చల్లగా మారింది. వాతావరణ శాఖ ఓ  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలులు, ద్రోణి ప్రభావంతో  రానున్న నాలుగు రోజులూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.   శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మంగళవారం(మార్చి 17) వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల పిడుగుపాటుకు కూడా అవకాశం ఉందని హెచ్చరించింది.  

By
en-us Political News

  
ఈ ప్రచారంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే మహిళ బస్సు కింద పడి పోయినప్పటికీ, డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లక్షల కోట్ల రూపాయల నష్టం అనే అంకెకు సంబంధించి ఏ ప్రభుత్వ సంస్థ లేదా కాగ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు.
సామాజిక మాధ్యమంలో పోస్టుల ప్రకారం.. 2004–2014 మధ్య భారీ స్థాయిలో ఖనిజ ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. మోనాజైట్ వంటి థోరియం కలిగిన ఖనిజాలు విదేశాలకు తరలించబడ్డాయి. దీని వల్ల దేశానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. థోరియం ఆధారిత అణు సాంకేతికతను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారు. అన్న తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇప్పటి వరకూ ఏ సీజన్ లోనైనా ఎస్ఆర్ హెచ్ సాధించిన విజయాలన్నీ ఆ జట్టు బ్యాటింగ్ బలంతోనే. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు 200 పరుగుల పై చిలుకు స్కోరును కూడా కాపాడుకోలేక చతికిల పడిన సందర్భాలున్నాయి. అటువంటి ఎస్ఆర్ హెచ్ సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ ప్రదర్శన వల్లనే భారీ విజయం నమోదు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల పెంపు అంశంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి మతపరమైన ఉద్రిక్తతలు హింసాత్మక రూపం దాల్చాయి.
ఏప్రిల్ 13, 1919 — భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో శాశ్వతంగా చెక్కుకుపోయిన నల్లరోజు.
దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసురుతున్న ఒక భారీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాపై తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.