విపక్షాలకు వరద దెబ్బ.. షా ,ప్రియాంక పర్యటన వాయిదా

Publish Date:Jul 29, 2023

Advertisement

రాష్ట్రంపై సుమారు పక్షం రోజులకు పైగా కమ్ముకున్న ముసురు చాలా వరకు సర్డుమణిగింది. అయితే, ఈ వారం పది  రోజులుగా   కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పంటల నష్టం, ఆస్తుల నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా డా సంభవించింది. ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా స్పష్టం కాకపోయినా, నష్టం భారీగానే ఉంటుందని అంటున్నారు. 

అదలా ఉంటే, రాష్ట్ర రాజకీయాలను వరుణ దేవుడు వదిలి పెట్టలేదు. రాజకీయ కార్యకలాపాల పై వర్షం ప్రభావం చూపింది. ఈరోజు ( జులై 29) న జరగ వలసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర (ఖమ్మం) పర్యటన వర్షం  కారణంగానే వాయిదా పడింది. బీజేపీ రాష్ట్ర పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న‘విపరీత’ పరిణామాలు, అంతర్గత కుమ్ములాటల  నేపధ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనపై నేతలు, క్యాడర్ పెట్టుకున్న ఆశలపై వరుణ దేవుడు వర్షాన్ని కుమ్మరించారు. నిజానికి, గడచిన రెండు నెలల్లో అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడడడం ఇది రెండో సారి..గత నెల (జూన్)15 న ఖమ్మంలో జరప తలపెట్టిన భారీ బహిరంగ సభ, గుజరాద్ వరదల కారణంగా వాయిదా పడింది. ఇప్పదు ఈరోజు జరగ వలసిన సభ తెలంగాణ వరదల కారణంగా రద్దయింది. 

అంతే కాదు, ఖమ్మ సభ రద్దయినా అమిత్ షా పర్యటనను హైదరాబాద్‌కు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో భగంగా  అమిత్ షా .. పూర్తిస్థాయిలో రాష్ట్ర యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే  విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ముందుగా రాష్ట్ర నేతలో భేటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటన ముగింపులో భాగంగా కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా ప్లాన్ చేశారు. అయితే, జూన్ 24 నుంచి మళ్ళీ కురిసిన వర్ష బీజేపీ నేతల ప్రయత్నాలకు బ్రేకులు వేశాయి.

కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన  నిరవధికంగా వాయిదా పడిందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రకటించారు.  వాన బీజేపీనే కాదు, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది. ఇక మొన్నీమధ్యే రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కదనోత్సాహంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తాము నిర్దేశించుకున్న ప్రియాంక గాంధీ వధేరా పర్యటనను వాయిదా వేశారు. జులై 30న ప్రియాంక కొల్లాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హాజరవ్వాల్సి వుంది. చాలా కాలంగా కాచుకుని కూర్చున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉద్దేశంతో కొల్లాపూర్ బహిరంగ సభను టీ.కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అదే సభలో మహిళా డిక్లరేషన్ పేరిట వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తమను గెలిపిస్తే మహిళల కోసం ఏం చేస్తామనే హామీలను గుప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తాజాగా ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయిదు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడ్డారని, చాలా ప్రాంతాల్లో కనీసం వారం రోజుల పాటు సహాయ చర్యలు నిర్వహించాల్సి వుంటుందని అందుకే ప్రియాంక పర్యటనను వాయిదా వేశామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు.

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలోనే చేరాల్సి వుండింది. కానీ, తన సొంత బలం చాటుకునేలా కొల్లాపూర్‌లో సభ నిర్వహించాలని, పొంగులేటి రాహుల్ సమక్షంలో పార్టీలో చేరితే.. తాను ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని జూపల్లి భావించారు. దానికోసం ప్రియాంక సమయమిచ్చే దాకా వెయిట్ చేశారు. ముందుగా జులై 20వ తేదీన కొల్లాపూర్ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీ దగ్గరపడుతున్నా ప్రియాంక రాక కన్ఫర్మ్ కాకపోవడంతో జూపల్లి ఒకింత కలవరపడినా.. చివరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యంతో ప్రియాంక రాకకు తేదీ ఖరారు చేశారు

. జులై 30న ఆమె వస్తారని, ఆమె సమక్షంలో జూపల్లి పార్టీలో చేరతారని ప్రకటించారు. అయితే.. ఈ ఏర్పాట్లకిపుడు భారీ వర్షాలు గండి కొట్టాయనే భావించారు. అటు అమిత్ షా పర్యటన వాయిదాతో టీ.బీజేపీ, ఇటు ప్రియాంక రాక వాయిదాతో టీ.కాంగ్రెస్ నేతలు కాస్త నిరాశలో పడినట్లయ్యింది.

By
en-us Political News

  
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.