పులివెందుల ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలి.. జగన్‌ సంచలన డిమాండ్‌.!

Publish Date:Nov 1, 2026

Advertisement

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఆయన.. పోలింగ్‌ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను రద్దు చేసి, తిరిగి పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

పులివెందులలో తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించడం లేదని జగన్‌ ఆరోపించారు. తనకు ఓటు ఉన్న పోలింగ్‌ కేంద్రంలో మాత్రమే ఏజెంట్లను అనుమతించారని, మిగిలిన 70 పోలింగ్‌ బూత్‌లలో తమ ఏజెంట్లకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించినట్లు తెలిపారు.

చైర్‌పర్సన్‌ అభ్యర్థిపై దాడి చేశారని, మీడియా ప్రతినిధులపైనా దాడులకు పాల్పడ్డారని జగన్‌ ఆరోపించారు. ఓటర్లను అడ్డుకోవడంతో పాటు, వారి ఓటర్‌ స్లిప్పులను చించివేస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

తన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు తొలుత అనుమతి నిరాకరించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయిందని జగన్‌ తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాక్రోచ్‌లు, మావోయిస్టులు పుట్టుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పులివెందుల పోలింగ్‌లో జరిగినట్లు తాము చెబుతున్న అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

 

 

[ YS Jagan, Pulivendula Elections, Repolling Demand, Election Irregularities, Supreme Court, Andhra Pradesh Politics, State Election Commission, Polling Booths ]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.