ఓటు చోర్ ఆందోళన... అసలు లక్ష్యం అదేనా?

Publish Date:Aug 18, 2025

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, లోక్ సభలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నంత  పనిచేశారు. ఆటం బాంబు పేలుస్తా అన్నారు. పేల్చారు. భారత ఎన్నికల సంఘం, ప్రధాని మోదీ, బీజేపీలతో కుమ్ముక్కై,’ఓట్ల చోరీ’ కి పాల్పడిందని ఆరోపించారు. ఆరోపించడమే కాదు,  దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవిగో ఆధారాలు అంటూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన’, ద్వారా అవునా, నిజమా, నిజంగానే ఓటు చోరీ జరిగిందా, అనిపించేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అలాగే, కర్ణాటక  రాజధాని బెంగుళూరులో మరో స్టేజి షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల గురించి కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు.అయితే ఆయన చేసిన ‘నిర్దిష్ట’ ఆరోపణల్లో,  ‘నిర్దిష్ట’ నిజాలు ఉన్నాయా లేవా, అనేది నిగ్గు తేలాలంటే, రాహుల్ గాంధీ, తాను చేసిన   ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, ఎన్నికల సంఘం, కోరింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 లోని, రూల్ 20 (3)(b) కింద, ప్రమాణం చేసి,అఫిడవిట్’ దాఖలు చేయమని కోరుతూ,కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కర్ణాటక చీఫ్ ఎలక్షన్ఆఫీసర్ ద్వారా,రాహుల్ గాంధీకి, వర్తమానం పంపింది. ఎదుకో ఏమో కానీ, రాహుల్ గాంధీ ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 


అయితే. రాహుల్ గాంధీ చేసిన చేస్తున్న నిర్దిష్ట ఆరోపణల్లో నిజం ఉన్న లేకున్నా, ఆయన ప్రస్తావించిన ఎన్నికల అవకతవకలు జరగడమే లేదని అనుకుంటే అది అత్మవచనే అవుతుంది. నిజానికి, 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల మొదలు, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు, పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎన్నికల అక్రమాలు అవకతవకలు జరగని ఎన్నిక ఇంత వరకు జరగలేదు. ఎక్కడిదాకానో ఎందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు రద్దయినట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనేక సందర్భాలలో  ఆరోపించారు.

ఆయన పోటీ చేసి, ఓడిపోయినా తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలలోనూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయని దయాకర్’ కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తోంది. అలాగే, మాజీ ఎమ్మెల్సీ రాజకీయ  విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్’ బల్క్ ఓట్లకు సంబంధించి  ఒకే గదిలో పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న స్వీయ అనుభవాన్ని, ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.
 సో .. రాహుల్ గాంధీ ప్రస్తావించిన దొంగ ఓట్లు, బల్క్ ఓట్లు, డ్యూయల్ ఓట్లు, చనిపోయినవారికి ఓటు హక్కు కొనసాగడం, బతికున్న వారికీ ఓటు లేక పోవడం వంటి సవాలక్ష  అవకతవకలు, అక్రమాలు, ఎన్నికల సంఘం పురుడు పోసుకోక ముందు నుంచి ఉన్నవే. ఆనవాయితీగా వస్తున్నావే. కాంగ్రెస్, బీజేపీ, లేదా మరో పార్టీ ఏపార్టీ అధికారంలో ఎవరున్నా, ప్రధాన ఎన్నికల అధికారిగా,అలనాటి శేషన్’ ఉన్నా ఈనాటి జ్ఞానేశ్ కుమార్’  ఉన్నా, అవకతవకలు అక్రమాలు జరగని ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. 

అప్పుడు ఇప్పడు జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి.అప్పుడే జరిగాయి, ఇప్పడు లేవు అనుకున్నా, అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అనుకున్నా,అది ఆత్మవంచన, పరనింద అవుతుందే కానీ, నిజం మాత్రం కాదు. నిజానికి,ఈవిషయంలో ఎదుటి వారిపై ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇప్పడు జరుగుతున్నది కూడా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ వైపు, మోదీ వైపు వేలు చూపితే, బీజేపీ కాంగ్రెస్ వైపు వేలు చూపుతుంది. ఒక విధంగా గొంగళిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా ఉంటుందో, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా అంతే.. అయితే ఈ రాజకీయ క్రీడలో రాజకీయ పార్టీల ప్రతిష్ట మాత్రమే కాదు, అతి పెద్ద ప్రజాసామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశానికి, ఎన్నికల నిర్వహణలో, ‘ది బెస్ట్’  అన్న కితాబు పొందిన మన ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను కూడా దిగజార్చి వేస్తోంది. అదే అసలు విషాదం.


అయినా, కాంగ్రెస్ నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఇతర విపక్ష పార్టీల నాయకులు, బీహార్ ఎస్ఐఆర్’, కర్ణాటకలోఓట్ల గోల్ మాల్’ వ్యవహారాన్నికలగాపులగం చేసి, ప్రజల్లో అపోహలను సృష్టించే ప్రయత్నం, గందరగోల చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, బీహార్’ లో ‘ఓటర్ అధికార యాత్ర’ పేరిట... రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారు.సవాళ్ళు విసురుతున్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన సంధానాలు ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల నఘం, రాహుల్ గాంధీ, ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించింది.అంతే కాదు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, లేదంటే, దేశానికి క్షపణ చెప్పాలని ఎన్నికల ప్రదానాధికారి, జ్ఞానేశ్ కుమార్’ ఆదివారం డిమాండ్ చేశారు.అందుకు ప్రతిగా విపక్షాలు,’ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఏమి జరుగుతుంది

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.