కర్నాటకలో కాంగ్రెస్ కోసం రఘువీరా ప్రచారం

Publish Date:Apr 19, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన, కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. రాజకీయాల్లోకి పునప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటన చేశారు.  పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమైన రఘువీరా,   రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సోనియా కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయించి వేధించడం,  ఆయనకు రెండేళ్లు శిక్షపడటం, కోర్టు తీర్పు వచ్చీరాగానే  పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేయడం,  నివాస బంగళాను కూడా ఖాళీ చేయించడం వంటి పరిణామాలు బాధించాయనీ, ఇటువంటి సమయంలో  సోనియా కుటుంబానికీ,  పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని రఘువీరా అన్నారు. రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారని రఘువీరా చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతను చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్  అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.  

1989 నుండి కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుండి 12 నియోజకవర్గాలలో తాను  ప్రచారం నిర్వహించడం రివాజుగా వస్తున్నదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని, ఇక్కడి నుంచే బీజేపీ పతనం మొదలవుతుందని రఘువీరా అన్నారు.  

తెలంగాణ విషయం పక్కన పెడితే.. ఆంధ్రలో కాంగ్రెస్ జాడ దాదాపుగా లేనే లేదు.. ఇలాంటి పరిస్థితిల్లో ఆయనొచ్చి చేసేదేమి లేదు. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ, ప్రశ్నిస్తామని వచ్చిన పార్టీ జనసేన.. ఈ పార్టీల మధ్య ..ఇప్పుడు కాంగ్రెస్ ను పట్టించుకునే వారు ఏరి...?

By
en-us Political News

  
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.