మీకు టీ అంటే చాలా ఇష్టమా? ఒక్క నెల మానేసి చూడండి అద్బుతం చూస్తారు!

Publish Date:Jul 4, 2026

Advertisement

భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

 నిద్ర నాణ్యత..

టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు.

ఎసిడిటి, గ్యాస్..

ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

దంత ఆరోగ్యం..

టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

ఒత్తిడి, ఆందోళన..

అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

చర్మం..

 టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది.

గుండె ఆరోగ్యం..

అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.

                                    *రూపశ్రీ.

By
en-us Political News

  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు.
అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై Best Before,Use By, Expiry Date వంటి పదాలు కనిపిస్తుంటాయి,చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.