ఆ అకాడమీలోంచి అందుకే వచ్చేసా..సింధు కామెంట్స్ వైరల్
Publish Date:Aug 25, 2022
Advertisement
బ్యాడ్మింటన్ చరిత్రలో పీవీ సింధు కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒలింపిక్స్ లో పతకాలు, కామన్వెల్త్ లో గోల్డ్ సాధించి భేష్ అనిపించుకుంది. ప్రస్తుతానికి లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎన్నో కబుర్లు చెప్పింది సింధు. కొన్నిటికి క్లియర్ గా జవాబులు ఇచ్చింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటికి వచ్చేయడంపై ఒక క్లారిటీ ఇచ్చింది. గోపి సర్ అకాడమీలో చాలా ఏళ్ళు ఆడాను. ఐతే ఆ అకాడమీలో జరిగిన కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు..నాకు సెట్ కావనిపించి వచ్చేసాను. ఒలింపిక్స్ లో ఆడాలంటే కాన్సంట్రేషన్ చాలా అవసరం. ఇలాంటి విషయాలు ఆలోచిస్తే గేమ్ సరిగా ఆడలేను అనిపించింది. ఈ అకాడమీలో నేను ఎంతో మంది కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా" అని చెప్పింది సింధు. అలాగే తన లైఫ్ లో జరిగిన ఒక బాడ్ ఇన్సిడెంట్ కూడా చెప్పింది సింధు. “2015 లో కాలి నొప్పితోనే ఆరు నెలల పాటు గేమ్ ఆడాను. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఒలింపిక్స్ లోకి వెళ్ళాలి . వెళ్లాలంటే నేను టాప్ - 16 లో ఉండాలి. కానీ అప్పటికి నేను టాప్ - 13 లో ఉన్నా. ఒలింపిక్స్ నా లక్ష్యం కాబట్టి నొప్పిని భరించి ముందుకెళ్లా. ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే పతకం నెగ్గడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.” కష్టడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అర్ధమయ్యింది అని చెప్పింది సింధు. అలాగే ఓనమాలు నేర్పింది ఎవరు అనే ప్రశ్నకు.. “మహబూబ్ అలీ నాకు బ్యాడ్మింటన్ లో ఓనమాలు నేర్పించారు. తర్వాత ఆరిఫ్, గోవర్థన్, గోపీగారి దగ్గర ట్రైన్ అయ్యాను. ప్రతి ఒక్క కోచ్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుని నా గేమ్ ని ఇంకా మెరుగుపరుచుకున్నాను . ఇండోనేషియా, కొరియాకు చెందిన కోచ్ ల దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఆపొనెంట్ కి నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తాను. మెడల్ గెలిచినప్పుడు పోడియంపై నిల్చుని జాతీయ జెండాను చూస్తూ.. జాతీయ గీతం వింటున్నప్పుడు నాలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. వేరే దేశంలో మన దేశపు జెండా ఎగరడం చాలా గొప్ప విషయం కదా" అంటూ ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పింది సింధు.
http://www.teluguone.com/news/content/pv-sindhu-says-quitting-gopichand-academy-25-142624.html





