కాబోయే భార్యే లోయలోకి నెట్టేసింది..పుణే ట్రెక్కర్ మర్డర్ పక్కా ప్లాన్!

Publish Date:Jun 23, 2026

Advertisement

 

మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్‌ కోట పర్యాటక ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడనుకున్న ఘటన.. పక్కా ప్రణాళికతో జరిగిన ఘోర హత్యగా పోలీసులు తేల్చారు. కాబోయే భర్తను ఆ యువతే తన స్నేహితుడితో కలిసి లోయలోకి నెట్టేసిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

పుణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లోహగఢ్‌ కోట వద్దకు ట్రెకింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతైన లోయలో పడి కేతన్‌ మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

ఘటనా స్థలంలో బలమైన గాలులు వీస్తుండటం వల్ల, కాబోయే భార్యను ఫోటోలు తీసే క్రమంలో కేతన్ అదుపు తప్పి కిందకు పడిపోయాడని అప్పట్లో కేసు నమోదు చేశారు. లోనావాలా రూరల్ పోలీసులు, స్థానిక శివదుర్గ్ మిత్ర రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి లోయ నుంచి అతని మృతదేహాన్ని వెలికితీశారు. కానీ, ఈ క్రమంలో పోలీసులు జరిపిన లోతైన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

కేతన్ మొబైల్ ఫోన్ రికార్డులు, ఘటనా స్థలంలో ఉన్న ఇతరుల సాక్ష్యాలను పరిశీలించిన పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి. నిందితురాలైన యువతికి ఈ వివాహం ఇష్టం లేదని, అందుకే తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను కొండపైకి తీసుకువెళ్లిందని సమాచారం. అనంతరం ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఏమార్చి, తన మగ స్నేహితుడితో కలిసి అతడిని లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దారుణ ఉదంతం ఇరు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేతన్, సదరు యువతికి ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్యాలెస్‌ను కూడా పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అంతలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా కాబోయే భార్య చేతిలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.

ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన యువతిని, ఆమెకు సహకరించిన మగ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి గల పూర్తి కారణాలు, వారి మధ్య ఉన్న ఇతర సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
 

By
en-us Political News

  
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
దుల నుండి ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయని డాక్టర్ రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక పొరలు నీటిని నిల్వ ఉంచే స్పాంజ్‌లా పనిచేస్తాయని, వాటిని పూర్తిగా తొలగిస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోతుందని హెచ్చరించారు.
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం..
అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2,750 గజాల విలువైన భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.
సిలికాన్ సిటీలో ట్రిపుల్ మర్డర్ కలకలం..
లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో రోజుకు రూ.100 చొప్పున నెలసరి రూ.3000 పొదుపు చేయడం ద్వారా 6.7% వడ్డీతో ఐదేళ్లలో రూ.2.14 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీ మొత్తాన్ని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.