Publish Date:Oct 29, 2026
ఏపీలో ఆదివారం (నవంబర్ 1) మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో తాడోపేడో తేల్చుకునేందుకు పార్టీలు, అభ్యర్ధులు సన్నద్ధమయ్యారు. తెలుగుదేశం కూటమి ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవంగా విజయం సాధించింది. జగన్ అడ్డా పులివెందులలో కూడా అదే పరిస్థితి. అయితే జగన్ సొంత గడ్డ పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అడ్డా అయిన మునిసిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరనీయకూడదన్న పట్టుదలతో ఉన్న జగన్.. పులివెందులలోనే మకాం వేశారు. మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్వయంగా నడుంబిగించారు. ఇప్పిటికే పులివెందుల మునిసిపాలిటీలోని సగం వార్డులను తెలుగుదేశం కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుని సత్తా చాటింది. మిగిలిన వాటి కోసం వైసీపీ, జగన్ పోరాడుతున్నారు.
సాధారణంగా అయితే అక్కడ ఎన్నిక జరుగుతోంది. ఓటర్లు గెలుపోటములు నిర్ణయిస్తారు. కానీ పులివెందుల మాత్రం సెపరేట్. అది జగన్ కంచుకోట. అలింటి కంచుకోటలో తెలుగుదేశం పాగా వేస్తే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 2029 ఎన్నికలపై పడుతుందన్నది జగన్ భయం. ఇప్పటికే గంలో పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోర పరాజయాన్ని చవి చూశారు. దీంతో ఎది ఏమైనా, ఏం చేసైనా పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.
దీంతో పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపోల్ లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి కల్పించడమే లక్ష్యంగా పోలీసులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.
[Pulivendula Municipal Elections, Jagan Pulivendula, YCP Baston Pulivendula, Andhra Pradesh Politics, Tension Pulivendula, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-municipal-elections-39-235796.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.