దళారుల గుప్పిట్లో ప్రజా ఆరోగ్యం ..
Publish Date:Apr 30, 2021
Advertisement
అన్నిరంగాలలో దళారులే కీలక పాత్ర అన్నది నిజం. అయితే ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరాలంటే. దళారులు. పెంక్షన్లు. ఇల్లు. ఆకరికి స్చూళ్ళు. కాలేజీసీట్లు ఇలా ఒక్కటి ఏమిటి, కొన్ని ప్రభుత్వాల హయాంలో అన్ని శాకల లోను దళారులు చొరబడ్డారు. ఈదళారులు ఎంతగా ప్రభావం చూపుతున్నారంటే ప్రభుత్వ పధకాలు కావాలంటే మాకే ఓట్లు వీయలంటూ ఈ దళారులు భయపెట్టేస్తాయికి ఎదిగిపోయారు. ఇక రైతు పండించిన పంటకు మద్దతు నిచ్చేది ప్రభుత్వం కాదు మధ్య దళారీ లే. మొత్తంగా చెప్పాలంటే అన్నిమార్కెట్ లో అన్ని రంగాలను శాసిస్తోంది దళారులే అన్నది వాస్తవం.రాజుల కాలం లో సైతం దళారులు ఉన్న వారిపై నిఘా వ్యవస్థ పనిచేసేది ప్రజలను ఇబ్బంది పెట్టె ఏ సమాచారం అందినా రాజాస్థానంలో విచారణ జరిపి శిక్షించేవారు ఆరకంగా కొంతమేరకు దళారులపై ఉక్కుపాదం మోపేవి రాజ సంస్థానాలు ప్రజా ప్రభుత్వాలు మాత్రం ఇటు ఇల్లు కట్టుకుంటే అనుమతికి, అటు స్థలాల అమ్మకాలు కొనుగోళ్ళు. లైసెన్స్ కావాలన్నా, నల్ల నీళ్ళు కావాలన్నా ముఖ్యమంత్రి సహాయనిది నుంచి ఆఖరికి తాము ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీ చేయాలన్నా దళారుల పాత్ర కీలకంగా మారింది. ఈ వ్యవస్థ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు అసలు ప్రభుత్వ అవినీతికి మూలాలు దళారులే . ఇక ఇప్పుడు ప్యాండమిక్ ను అదునుగా భావించిన దాళారులు మెడికల్ మాఫియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈమేరకు ప్రభుత్వ ప్ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్లు, చికిత్స కోసం దళారులదే పెత్తనం సాగిస్తున్నారు. అందినంత మేర దండుకుంటున్న ఈ దళారులు తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలా అన్నదేగా మీ ప్రశ్న ఆసుపత్రిలో చేరడంఇన్సురెన్స్, చికిత్చ, ఆతరువాత దిక్కులేక మరణిస్తే శవాల మీద చిల్లర ఏరుకునే చందాన అంబు లెన్స్, దహన సంస్కారాలకు ప్యాకేజి పెట్టి మరీ వ్యాపారం చేస్తున్న ఈ దళారులను ఏమనాలి ? అదిఅలా ఉంటె ఇక మందులు, వ్యాక్సిన్ ల కృత్రిమ కొరతకు కారణం ఈ దళారులదే అని అర్ధం అవుతోంది.
భారాత్ లో కో వ్యాక్సిన్ పై ప్రజలు మొగ్గు చూపడం తో, దీని కోరత సృష్టిస్తేఅసలు వ్యాక్సిన్ కొరత సృష్టిస్తే మళ్ళీ వ్యాక్సిన్ కొత్తధరలువచ్చేదాకావ్యాక్సిన్ ఇచ్చేది లేదని ప్రైవేటుఆసుపత్రులు బీష్మించుకు కూర్చున్నాయని అంటు న్నారు వైద్య రంగ నిపుణులు.ఇక గత్యంతరం లేక వేరొక వ్యాక్సిన్ తీసుకోక తప్పని పరిస్థితిని దళారులుకల్పిస్తున్నరనేది నిజం.అని వైద్య రంగనిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోవిడ్ సమయంలో సైతం ప్రాణాలను రక్షించే మేడి సివిర్ లాంటి మందు ఇతర మందులను మార్కెట్లో లేకుండా చేస్తే కొరత సృష్టించడం లేదా ఎక్కువధరకు అమ్మి సొమ్ము చేసుకోడం చూస్స్తుంటే ఇబ్బిది ముబ్బిడిగా వైద్య అధికారులు ఇటు ఇతర సిబ్బంది తమ చేత నైనంత చేతివాటాన్ని ప్రదర్శించడం చూస్తే విద్యారంగంలో నే కాదు వైద్య రంగంలో కూడా దళారులు పీకలేనంత గా వేళ్ళు ఊనుకు పోయారాన్ని సామాజిక కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. నోరు ఉన్నవాడిదే రాజ్యం అని అలా కాదు కండ ఉన్నావా దిదే రాజ్యమని అనే వారు కోవిడ్ పరిస్థిని పూర్తిగా మార్చేసింది అటు మెడికల్ మాఫియా ఇటు దళారులు పూర్తిగా కమ్మేసారని సామాన్యుడు వాపోతున్నాడు ఇప్పటికైనా ప్రభుత్వాలు అలసత్వం వీడి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడి ప్రజలకు మేలైన వైద్య విధానాన్ని అందించాలని అమలుచేయాలని సామాన్యుడు మొరపెట్టుకుంటున్నాడు.
http://www.teluguone.com/news/content/publik-health-inhands-of-midlemen-and-maafiyaa-39-114580.html





