నవ్వుల పాలైనా నవ్వులేనా? జగన్ తీరుపట్ల జనాగ్రహం..

Publish Date:Apr 30, 2022

Advertisement

అడుసు తొక్కనేల .. కాలు కడగనేల’ అనేది సామెత. ఇప్పుడు ఆ సామెతను నిజం చేశారు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుట్ల తారక రామ రావు. నిజమే కావచ్చును, ఆంధ్ర ప్రదేశ్’లో కరెంటు కష్టాలు నిజం కావచ్చును. నీళ్ళు లేని మాటా నిజం కావచ్చును. రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయన్న మాటలోనూ నిజం లేక పోలేదు. ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం, అవినీతి ప్రస్థానం కారణంగా ప్రాధాన్యతలు తారు మారు కావడం, ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో కూరుకు పోవడం కూడా నిజమే కావచ్చును. 
కానీ, తెలంగాణలో అన్నీ బాగున్నట్లు తగుదునమ్మా, అని పొరుగు రాష్ట్రం వ్యవహారాలో మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ వేలు పెట్టడం ఏమిటనే ప్రశ్న సామాన్యులలో వినవస్తోంది. ఇది ఐదు కోట్ల ఆంధ్రులను అవమాన పరిచడం కాదా అని. ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ‘పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని’ వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు నింపాదిగా, అన్యాపదేశంగా అలాంటి వ్యాఖ్యలు చేశానే గానీ, మరే దురుద్దేశం లేని సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆయన విషయం ఏమో కానీ, తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చిందని అంటున్నారు. మాములుగా అయితే, కేటీఆర్’ వ్యాఖ్యాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదేమో , కానే, ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారని అందుకే, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 
విషయంలోకి వస్తే, క్రెడాయ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు.అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు.' అని కేటీఆర్. నిజానికి ఆయన  ఎవరో మిత్రులు చెప్పారని అంటూ, చెప్పుకొచ్చినా,నిజానికి అది ఆయన అభిప్రాయమే అని వేరే చెప్ప నక్కరలేదు. నిజానికి, పొరుగు రాష్ట్రం ఏపీని ఇలా  తూలనాడి మాట్లాడడం తెరాస నాయకులకు కొత్త కాదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఏకంగా అసెంబ్లీలోనే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజ జరిగితే తెలంగాణ అంధకారంలోకి పోతుందని చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏపీ అంధకారంలో ఉందని అన్నారు. అలాగే, ఒకరిద్దరు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిని అవహేళన చేస్తూ మాట్లాడారు. ఏపీలోఅప్పు పుట్టనిదే పూట గడవదని ఎద్దేవా చేశారు. 
అయితే, ఇప్పుడు కేటీఆర్, అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఏపీ గురించి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదా అంటే, లేదని కాదు, జగన్ రెడ్డి  మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో కేవలం విద్యుత్, రోడ్లు, నీళ్ళు మాత్రమే కాదు, మౌలిక సదుపాయాల కల్పన మొత్తానికి మొత్తంగా అటకెక్కింది. మౌలిక సదుపాయాలు లేకుండా, రాష్ట్రం అభివృద్ధి చెందదు. అందుకే, మూడేళ్ళలో రాష్ట్రానికి చెప్పుకోదగిన పెట్టుబడులు కోటగా రాక పోగా, గతంలో చంద్రబాబు హయమలో వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లి పోతున్నట్లు వార్త లోస్తున్నాయి. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ వైపుకు దృష్టి మరల్చ లేదు. అప్పులు చేయడం, మీట నొక్కి ఓటర్ల ఖాతాల్లోకి బట్వాడా చేయడం, కానీ, అభివృద్ధి గురించిన అలోచన  జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ కోశానా లేదు. అందుకే, ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను అనేక సందర్భాలో తప్పు పట్టింది. హెచ్చరికలు చేసింది. అయినా దున్నపోతు మీద వర్షం చందంగానే కథ నడిచి పోతోందని విశ్లేషకులు అంటున్నారు.  అందుకే ఇప్పుడు కూడా, పొరుగు రాష్ట్రం నుంచి అవమానకరమైన వ్యాఖ్యలు వస్తున్నా, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా కేసీఆర్, కేటీఆర్ ఇతర మంత్రులు  వ్యాఖ్యలు చేసినా ఎవరెవరో స్పందిస్తున్నారు కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం నోరు మెదపలేదు. చిద్విలాసంగా తమ ట్రేడ్ మార్క్ నవ్వు నవ్వుకుంటున్నారని సామాన్య ప్రజలు, ఆవేదన వ్యక్త పఅరుస్తున్నారు.అందుకే మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు, బాధ పడినట్లు, కేటీఆర్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయని, అంటున్నారు. ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

By
en-us Political News

  
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.