ఉన్న మాటంటే జగన్ టీమ్ కు ఉలుకెందుకు?.. వాస్తవాలు ఒప్పుకోవడానికి జంకెందుకు?

Publish Date:Apr 29, 2022

Advertisement

ఎపిలో కరెంట్‌, రోడ్లు,నీళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలు వైసీపీ వెన్నులో చలిపుట్టించాయి. కాళ్ల కింద నేల కదిలిపోతోందా అన్నంతగా ఆ పార్టీ రియాక్ట్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి నానా అగచాట్లూ పడింది. పడుతోంది. అదే సమయంలో తెలుగుదేశం నేతలు కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయనీ, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించాలని హితవు పలుకుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందిచిన తీరు ఉన్న మాటంటే ఉలుకెక్కువ అన్న నానుడికి సరిగ్గా అతికినట్లు సరిపోతుందని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద  కెటిఆర్‌ ఏపీలో పరిస్థితులపై చేసిన కామెంట్స్ తెరాస, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి.   మాదాపూర్‌ హైటెక్సలో క్రెడాయ్
ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన  కేటీఆర్ అదే వేదికగా అభివృద్ధి విషయంలో ఏపీ అధ: పాతాళంలో ఉంటే.. తెలంగాణ ఆకాసమే హద్దుగా ఎదుగుతోందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు.  మూడేళ్ల కిందటి వరకూ ఏపీ తెలంగాణలు అభివృద్ధిలో పోటీ పడితే.. ఆ తరువాత ఏపీ రేసులోంచి పూర్తిగా తప్పుకుందన్న వాస్తవాన్ని ఆయన తన వ్యాఖ్యల ద్వారా కళ్లకు కట్టారు. 

అంతే కాకుండా తెలంగాణ అప్పులు భవిష్యత్ తరాలపై పెట్టుబడి అని కూడా అన్నారు. ఆ మాటతో ఏపీలో అప్పులు ఆ రాష్ట్రంలో అభివృద్దికి ఇసుమంతైనా దోహదపడటం లేదని పరోక్షంగా ఎత్తి చూపారు.  ఇది జగన్ టీంకు పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యింది. ఉన్న వాస్తవాన్ని అంగీకరించలేక.. కేటీఆర్ వ్యాఖ్యలు అసత్యాలని గట్టిగా చెప్పలేక.. సింగరేణి, బొగ్గు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఆంధ్రా సంగతి మీ కెందుకు.. హైదరాబాద్ లోనే కరెంటు లేదు చూసుకోండంటూ ఎదురుదాడికి ప్రయత్నించి నవ్వుల పాలయ్యారు. హైదరాబాద్ లో మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టారా? అంటూ తెలంగాణ మంత్రులు ప్రశ్నించే సరికి బొత్సకు నోట మాట రాని పరిస్థితి ఎదురైంది. అంతే కాదు.. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా వాళ్లు సైతం బొత్స వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తేల్చేశారు. సామాజిక మాధ్యమంలో ఆయనను ట్రోల్ చేశారు.  

ఆంధప్రదేశ్‌లో రోడ్లు, కరెంటు, నీళ్లపై   కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ వేడిని రగిల్చాయి. దాదాపు ఏపీ మంత్రులంతా కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పి కొట్టడానికే తమ శక్తియుక్తులన్నీ వినియోగించారు. జగన్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తోందంటూ చెప్పుకోవడానికి నానా యాతనా పడ్డారు.  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విజయవాడకు వచ్చి చూస్తే ఏపీ అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ఏపీలో తాగు, సాగు నీటికి సమస్య లేదని నమ్మబలకడానికి ప్రయత్నించారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా విమర్శలు కురిపించేశారు.  అయితే విపక్ష తెలుగుదేశం గణాంకాలతో ససాక్ష్యంగా ఏపీలో విద్యుత్, రోడ్లు, నీళ్ల పరిస్థితిని వివరిస్తూ కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని తేల్చేసింది. జగన్ అసమర్థత కారణంగానే పొరుగు రాష్ట్రం మంత్రి ఏపీపై ఇంత చులకనగా మాట్లాడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని విమర్శించింది.  ఉన్న మాటంటే ఉలుకెందుకంటూ సామాజిక మాధ్యమంలో వైసీపీపై సెటైర్లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని అంగీకరించి.. వాటిని చక్కదిద్దేంతుకు ప్రయత్నిస్తే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు సైతం ఏపీ సర్కార్ కు హితవు చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.