పీఎస్సార్ అంజనేయులుకి మళ్లీ అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి
Publish Date:Jun 4, 2025
Advertisement
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పీఎస్సార్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలిస్తారు. ఇదే సమస్యతో ఆంజనేయులును గత నెల 31న ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించిన అధికారులు చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు. పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగున్న సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/psr-anjaneyulu-taken-to-hospital-fron-jail-39-199286.html





