సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ : సీఎం చంద్రబాబు

Publish Date:Apr 7, 2026

Advertisement

 

రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు  అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుద్ఫాదక విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. 

సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారాలోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ , సీఎస్ జి.సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 


31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్ కు కనెక్టు చేసేలా చూడాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా  ట్రాన్స్ మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

ప్రస్తుతం రాజస్థాన్ లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కంజ్యూమర్ ప్రాడెక్ట్స్  తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపూర్ లలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్  పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలో జీసీసీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఏపీ జీసీసీలకు కేంద్రంగా మారాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాల్లో వస్తున్న వ్యర్ధాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులను ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రంగాల్లో కాలుష్య కారకాలు లేకుండా ఇథనాల్ తరహా బై ప్రాడెక్టులు వచ్చేలా చూడాలని దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దీనిపై కేంద్రం నుంచి సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. 

పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు

రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవటం పై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.  భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేలా ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ ను నిర్దేశించాలన్నారు. ఫార్మా, స్టీల్, గ్రీన్ ఎనర్జీ, బీఈఎస్ లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ఓ ఎస్ఓపీని సిద్ధం చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ  భద్రతా ప్రమాణాలను పారిశ్రామిక యూనిట్లు కలిగి ఉండాలని తేల్చి చెప్పారు. 

ఇటీవల రాష్ట్రంలోని బాణా సంచా తయారీ యూనిట్లలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాణా సంచా తయారీ యూనిట్లు, మిల్క్ డెయిరీలు లాంటి అంశాల్లో ఉల్లంఘనలు లేకుండా ప్రామాణిక విధానాలు జారీ చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రమాణాలను పాటించే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్వాంటం టవర్స్ ను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూములు కేటాయించిన పర్యాటక ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని.. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు. 

వేగంగా ప్రాజెక్టులు గ్రౌండింగ్ 

రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభం అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వీటితో పాటు భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా సాకారమయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేకించి ఆయా ప్రభుత్వ శాఖలు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆయా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. భారీ ప్రాజెక్టులపై ప్రతీ ఎస్ఐపీబీ సమావేశంలోనూ సమీక్షిద్దామని సీఎం స్పష్టం చేశారు. 

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉత్పత్తి సామర్ధ్యం పెరగాలన్నారు. పామాయిల్, కోకో లాంటి ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని సీఎం సూచించారు. ఉద్యాన ఉత్పత్తులు 200  లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 400 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగాలని అన్నారు. దీనికి తగినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రాడెక్టు పర్ఫెక్షన్ పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 

రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలని సీఎం సూచించారు. తాజాగా 16వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి రాష్ట్రంలో గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.60 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా 538 ఎంఓయూలకు గానూ రూ.11.38 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనుంది. 
 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.