రాష్ట్రపతికి ప్రొటోకాల్ వివాదం...కేంద్రం సీరియస్

Publish Date:Mar 8, 2026

Advertisement

 

పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రోటోకాల్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రథమ పౌరురాలకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీళ్లు లేవు, ద్రౌపది ముర్ము కాన్వాయ్ వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది. అంటూ ఆదివారం సాయంత్రం 5 గంటలులోగా వివరణ ఇవ్వాలని  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ , దీనిపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి  నోటీసులు జారీ చేసింది. ప్రొటోకాల్ ఎక్కడ విఫలమైంది? బాధ్యులెవరు? అనే అంశాలపై నివేదిక కోరింది. ఓ ఆదివాసి మహిళ అయిన రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా అవమానం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి

అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ముర్ము శనివారం పశ్చిమ బెంగాల్‌ వెళ్లారు. అయితే ఆ సదస్సుకు బెంగాల్ సర్కార్ అనుమతి నిరాకరించడంతో.. చివరి నిమిషంలో మరోచోటికి మార్చారు. దీంతో కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే అక్కడికి వచ్చారు. ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్రపతిని స్వాగతించేందుకు సీఎం, మంత్రులు రావాల్సి ఉండగా రాలేదు. దీనిపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు.  బెంగాల్ సర్కార్ అన్ని హద్దులు దాటిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం తర్వాత అమెరికా చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం విశేషం.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జూనియర్ ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్ వారిని బెదిరించి, నిందితులైన సీనియర్ అధికారులకు సహకరించారని ఆరోపణలున్నాయి.
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.