Publish Date:Jul 26, 2022
ప్రైవేటీకరణ కేంద్రం పాలసీ అని మరో సారి తేలిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రై ‘వేటు’ వేయడమే తమ విధానమని కేంద్రం పార్లమెంటు సాక్షిగా అంగీకరించేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలలో ఉన్నా వాటిని ప్రైవేటుకు అప్పగించేసి డబ్బులు దండుకోవడమే లక్ష్యమని తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలోనే నడుస్తోందని అంగీకరించింది.
అయినా సరే విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పించడానికి నిర్ణయించేశామనీ, ఆ నిర్ణయంలో మార్పు ఉండదనీ తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 2021-22 ఆర్థిక సంవత్సరం లో 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. తెలుగుదేశం ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో విశాఖ ఉక్కు కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు వచ్చాయని పేర్కొన్నారు.
అయినా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా కేంద్రం ఖాతరు చేయడం లేదు. రాష్ట్రం మొక్కుబడిగా ప్రైవేటీకరణ వద్దని ఓ లేఖ రాసేసి చేతులు దులిపేసుకుంది. అయితే కేంద్రం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న విధానానికి కట్టుబడి విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగించేయడానికే సిద్ధ పడుతోంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/profits-is-no-matter-visakha-steel-privitisation-sure-25-140559.html
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Publish Date:Oct 31, 2026
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?