ప్రొద్దుటూరు కాంగ్రెస్ లో పదవుల చిచ్చు

Publish Date:Feb 27, 2012

Advertisement

ప్రొద్దుటూరు: మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు త్వరలో జరగుతున్నయనే సూచనలు వస్తున్న తరుణంలో కడపజిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతుండటం ఆ పార్టీని కలవరపెడుతుంది.తాజాగా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి మధ్య పదవుల చిచ్చు రగిలింది. ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బషీర్ అహ్మద్ పేరును ప్రతిపాదించానని, ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రకటించారు. దీనికి నియోజకవర్గ ఇన్ చార్జి ముక్తియార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమతో ఏమాత్రం సంప్రదించకుండానే బషీర్ అహ్మద్ పేరును ఏకపక్షంగా ప్రకటించారంటూ ఆయన వరదరాజులురెడ్డిపై పిసిసి, డిసిసికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు బైటపడ్డాయి.


వరదరాజులురెడ్డి జగన్ వర్గంలోకి వెళ్ళిన సందర్భంలో ఆయన అనుచరుడైన ముక్తియార్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అతనికి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఇస్తామని అమాత్యులు, పిసిసి హామీ ఇవ్వడంతో ముక్తియార్ కాంగ్రెస్ లోనే  ఉండిపోయారు. ఇది వరదరాజులు రెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. వరదరాజులురెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటినుంచి ముక్తియార్ కు చెక్ పెడుతూ వచ్చారు. దీనిలో భాగంగానే మైనార్టీ వర్గానికి చెందిన మరో నాయకుడు బషీర్ అహ్మద్ ను ప్రొద్దుటూరు  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ప్రకటించారు. ఈ ప్రకటన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రగిల్చింది.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.