ఖాకీవనం.. పోలీసుల దైన్యం

Publish Date:Apr 27, 2023

Advertisement

తలపై మూడు సింహాల టోపి.. చేతిలో లాఠీ.. నడుముకి బెల్ట్ పెట్టుకొని.. కాళ్లకు బూట్లు వేసుకొని.. టాప్ టూ బోటమ్..  ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసుల ఆహార్యంలో కానీ, వారి వ్యవహార శైలిలో కానీ  కర్కశంగా... కఠిన్యంతో నిండిపోయి ఉంటుందని దాదాపుగా అంతా భావిస్తారు. కానీ వారూ మనుషులే.. వారికీ మనసు  ఉంటుందని.. వారికీ  కుటుంబం ఉంటుందనీ..   సెంటిమెంట్లు ఉంటాయని.. ఎవరు  అనుకోరు, భావించరు.

అంతే కాదు డ్యూటీలో భాగంగా వారు తీవ్ర ఆందోళనలకు లోనవుతారని.. వారి మానసిక సంఘర్షణ కారణంగా ఎంతో  కొంత  క్షోభకు గురవుతారని..  ఆ ఆవేదనను వారు.. మనసు పొరల్లో నిగూఢంగానే దాచేసకుంటారనీ,  ఈ పరిస్థితిని ప్రతి పోలీసూ.. ఎప్పుడొ ఒకప్పుడు.. ఎక్కడో అక్కడ.. ఎదుర్కొనే ఉంటారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే..  రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపీ స్థాయి నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు ఈ పరిస్థితికి ఎవరూ అతీతులు కారు. ఇందులో ఎలాంటి ఎటువంటి సందేహం అవసరం లేదు.
 
తాజాగా హైదరాబాద్‌లో  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు   షర్మిల.. ఆమె తల్లి  విజయమ్మ.. పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. షర్మిల, విజయమ్మ పోలీసుల పట్ల వ్యవహరించిన తీరును హైదరాబాద్ నగర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనల వల్ల పోలీసుల ఆత్మాభిమానం దెబ్బ తింటుందని.. పోలీసుల సహానాన్ని పరీక్షించడం తగదంటూ హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం.. నిరంతరం పాటు పడే పోలీసులపై ఇటువంటి దాడులు జరగడం ఇదే తొలిసారా? అంటే కచ్చితంగా కాదు.

బీఆర్ఎస్  నాయకులు, ప్రస్తుత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు  గతంలో  అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు  .. మీడియాలో, సోషల్ మీడియలో  అప్పట్లో విపరీతంగా వైరల్ అయినాయి. అదే విధంగా గతంలో ఏపీ మంత్రి,  వైసీసీ నాయకుడు గుమ్మనూరి జయరాం స్వగ్రామమైన కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు.. ఆ గ్రామానికి చేరుకొని.. పేకాటరాయుళ్ల నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులపై సదరు మంత్రి గారి సోదరుడు ఆయన  అనుచరులు కారం పోడితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఇక గత ఏడాది హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే.. సాక్షాతూ ఎస్ఐ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ.. గుంజడం జాతీయ మీడియాలో సైతం ప్రసారమైంది. ఇలా చెప్పుకొంటూ పోతే పోలీసులపై రాజకీయ నేతలు చేసిన దాడులు జాబితా  కొండవీటి చాంతాడంత  ఉంటుంది.  మరోవైపు ఇటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాలకే పరిమితమా? అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా పోలీసులపై నాయకుల వ్యవహారశైలి ఇలాగే  ఉంటోందని చెప్పడానికి లెక్కలేనన్ని దాఖలాలున్నాయి.  

అయితే పోలీసులపై వివిధ రాజకీయ నేతలు దాడి చేస్తున్న వీడియోలు... అందుకు సంబంధించిన వార్తా కథనాలు..ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంటే.. దాడికి గురైన పోలీసుల కుటుంబాల్లో కలవరం రేగడం సహజం. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులుగా మారుతున్న పోలీసులు.. ఆ ఆవేదనను పంటిబిగువునే భరిస్తూ.. మళ్లీ విధినిర్వహాణలో భాగస్వాములవుతోన్నారు.  

By
en-us Political News

  
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.