వెయ్యేళ్ల జైన శిల్పాన్ని కాపాడుకోవాలి

Publish Date:Aug 5, 2024

Advertisement

ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి 
 

కర్నూలుకు పాతిక   కిలోమీటర్ల దూరంలో, కల్లూరు మండలం, నాయకల్లు గ్రామం శివారులో నిర్లక్ష్యంగా పడి ఉన్న వెయ్యేళ్ల నాటి వర్థమాన మహావీరుని శిల్పాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్  సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

 ఊరు, వాడా, మారుమూల పల్లెల్లో అస్తవ్యస్తంగా పడి ఉన్న శిల్పాలు, శాసనాలు, శిథిలాలపై స్థానికులకు అవగాహన కల్పించే "ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పొస్టేరిటి" కార్యక్రమంలో భాగంగా, ప్లీచ్ ఇండియా బృందం నాయకల్లు గ్రామం లో  బయట నిర్లక్ష్యంగా పడి ఉన్న శిల్పాలను ఆదివారం నాడు క్షుణ్ణంగా పరిశీలించింది.

 గ్రామానికి ఉత్తరంగా రోడ్డు పక్క పొదల్లో ఉన్న 24వ జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి శిల్పం, ఒక స్తంభం, పీఠాలను గ్రామానికి తరలించి, భద్రపరిచి, చారిత్రక వివరాలతో ఒక పేరు పలకను ఏర్పాటు చేయాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

 మహావీరుని శిల్పం, ఆలయ విడి భాగాలు క్రీ. శ. 10వ శతాబ్దం నాటి రాష్ట్ర కూటలకు చెందినవని, పద్మాసనంలో ధ్యానముద్రంలో కూర్చొని ఉండగా, ఎడమ కాలు తల వెనక ప్రభా మండలం భిన్నమైనాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ అధికారి, మహేంద్ర నాయుడు ప్లీచ్ ఇండియాకు చెందిన జితేంద్ర, చరణ్, శ్రీహరి, హరీష్, ఉదయ్ కిరణ్, దుర్గ, మైత్రేయి, కౌస్తుభ్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు. 

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.