జగన్ ఢిల్లీ ధర్నా... వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదు!

Publish Date:Aug 5, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా అట్టర్ ప్లాప్ అయ్యింది. జనమూ పట్టించుకోలేదు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అది పక్కన పెడితే జగన్ హస్తిన ధర్నా వెనుక పెద్ద వ్యూహమే ఉందని వైసీపీ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. రాజ్యసభలో తన బలం చూపి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దారిలోకి తెచ్చుకోవడం, అదే సమయంలో అదే బలాన్ని చూపి కాంగ్రెస్ కు దగ్గర కావడం అన్న రెండంచల వ్యూహంతో ఆయన ఏపీలో శాంతి భద్రతల సాకు చూపి హస్తిన వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు.  అయితే ఆ రెండంచల వ్యూహం ఘోరంగా విఫలమైంది. అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ జగన్ ను నమ్మి దగ్గరకు రావడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపలేదు. 

వాస్తవానికి నిజంగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే జగన్ హస్తినలో ధర్నా చేసి ఏపీకి తిరిగి వచ్చేసి ప్యాలెస్ కు పరిమితం కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఊరూ వాడా ఏకం చేస్తూ రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టి ఉండేవారు. లేదా ఆయన హస్తిన ధర్నాలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టి మరీ తెలుగుదేశం దౌర్జన్యకాండలో 36 మంది వైసీపీ కార్యకర్తలు మరణించారని చెప్పుకున్నారుగా, వారందరినీ పరామర్శించడానికి పర్యటనలు చేపట్టేవారు. అవేమీ లేకుండా ఆయన అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ అంటూ ఇంకా అంత: పురానికే పరిమితమయ్యారు.  

దీంతో ఆయన హస్తిన ధర్నా లక్ష్యం ఏమిటి అన్న దానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ ఆందోళన, హస్తిన ధర్నా అంతా ఒక సాకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హస్తిన ధర్నా తరువాత జగన్ తాడేపట్టి, బెంగళూరు ప్యాలెస్ ల మధ్య షటిల్ సర్వీస్ కే పరిమితమయ్యారంటే... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని ఆయన అంగీకరించేసినట్లే కదా అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన హస్తిన ధర్నా వెనుక ఉద్దేశాలేమిటన్న దానిపై విశ్లేషణలు చేస్తున్నారు.  

జగన్‌ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు వచ్చి సంఘీభావం చెప్పారు. దాంతో జగన్ కాంగ్రెస్ కు చేరువకావడానికి ధర్నా ద్వారా మార్గం సుగమం చేసుకున్నారని అంతా భావించారు. అయితే ధర్నా తరువాత స్వల్ప వ్యవథిలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రెండు సార్లు బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ లతో సయోధ్య కోసం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు, తన సొంత సోదరి షర్మిల విమర్శల దాడిని నియంత్రించడం కోసం కాంగ్రెస్ తో సయోధ్య, కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తనపై అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకోకుండా నిరోధించడం కోసం బీజేపీతో మైత్రి అన్న వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే  కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా జగన్ ను దగ్గరకు రానీయడానికి అంగీకరించలేదని అంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.