Publish Date:Apr 27, 2026
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
Publish Date:Apr 27, 2026
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
Publish Date:Apr 27, 2026
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
Publish Date:Apr 27, 2026
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Publish Date:Apr 27, 2026
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
Publish Date:Apr 27, 2026
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
Publish Date:Apr 26, 2026
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
Publish Date:Apr 26, 2026
కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత, సామాజిక సంబంధాల చుట్టూ కూడా నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.
Publish Date:Apr 26, 2026
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో 15 ఏళ్ల వైభవ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
Publish Date:Apr 26, 2026
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Publish Date:Apr 26, 2026
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
Publish Date:Apr 26, 2026
అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Publish Date:Apr 26, 2026
గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది.