ముందస్తుకు సిద్ధం కండి... చంద్రబాబు 

Publish Date:Nov 3, 2022

Advertisement

ఇక సమరానికి సిద్ధపడాల్సిన సమయం మరింత ఆసన్నమయింది.. అందరూ చేతికి అందిన వస్తువు ను ఆయు ధంగా చేసుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేయండి.. అంటూ అదేదో సినిమాలో రెండో హీరో పెద్ద డైలాగు.. ఊరు ఊరంతా ఒకే అనేస్తారు.. రాళ్లు రప్పా కూడా పదును పెట్టడంలో నిమగ్నమవుతారు. ఇక యుద్ధమే, విజయమే.. అన్న స్థాయిలో నాయకుడికి జేజేనాదాలు పలుకుతా రు. తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులు, అభిమానులను అందర్నీ రాబోయే ఎన్నికలకు మరింత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ఎన్టీ ఆర్ జిల్లా టీడీపీ కార్య కర్తల సమావేశంలో మాట్లాడుతూ,  అనుకున్నదాని కంటే మరింత ముందుగానే ఈసారి ఎన్నికలు జరి గేందుకు అవకాశం ఉందిగనుక పార్టీ విజయానికి అవసరమైన కార్యక్రమాలు, జనాన్ని సమాయత్తం చేయడంలో నాయకులు మరింత పదునుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

నిజవే.. సమయం ఆసన్నమయిందనే ప్రజలూ అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రజాహితంగా నడవడం కంటే ప్రజాకంటకంగా మారిందనే అభిప్రాయాలు, నినాదాలే అంతటా వినపడుతున్నాయి. ఏ రంగంలోనూ పిసరంత మార్పు, అభివృద్ధి జరగలేదు. కేవలం విపక్షాల మీద విరుచుకుపడటం, నోటదూల తీర్చుకోవడం తప్ప ప్రత్యేకించి ప్రజాహితంగా ఈ పనిచేస్తున్నాం, చేశా మని చెప్పలేని స్థితిలో జగన్ సర్కార్ ఉంది. ప్రజలు కూడా మూడేళ్ల పాలనలో విసిగెత్తారన్నది వారి వ్యతిరేకతే తెలియజేస్తోంది. అధికారంలోకి రావడినికి ముందు ఇచ్చిన హామీలు, చేసిన ప్రమాణాలన్నీ గాలికి వదిలేసి కేవలం బటన్  దబాయించే సీఎంగా పేరుతెచ్చుకున్నారు జగన్.  రాష్ట్రంలో ఏ ప్రాంతా నికి వెళ్లినా నిరసనలే వెల్లువెత్తుతున్నాయి. గడప గడపకూ ప్రబుత్వం అంటూ తమ ప్రభత్వ పనితీరు, పథకాల గురించి ఉపన్యాసాలిచ్చి ప్పజలను తమ వేపు తిప్పుకునే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రు లకు మిగిలింది రోజూవారీ అవమానాలే. అదీ ఓట్లు వేసిన ప్రజల నుంచి.  

మూడేళ్ల పాలనను అద్దంలో చూపినట్టు జగన్ కి  ప్రజల ఛీత్కారమే చూపింది.  కేంద్రంతో స్నేహబంధం ఉన్నప్పటికీ రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యిచూపడం గమనించారు. కేవలం ప్రయాణాలు తప్ప వాస్తవానికి కేంద్రం నుంచీ ఏమీ సాధించుకురాలేకపోయారు. ప్రజలు కోరుకునేది సుపరిపాలన తప్ప వేరేమీ ఉండదు. సుపరిపాలన మాటే లేకుండా కాలం గడిపేస్తోంది జగన్ సర్కార్. ఎవరికీ సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు.  క్రమేపీ అన్ని లెక్కలూ  తప్పా యి. వ్యూహాలన్నీ తిరగబడ్డాయి. వ్యూహ కర్తలు దూరమయ్యారు.. జగన్ నీ గెలుపు నీదే, నీ ఓటమీ నీదే అనేశారు. ప్రస్తుతం జగన్ తనను తాను గెలిపించుకోవడానికి, తన పార్టీని గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేసుకోవా ల్సిందే. కారణం ప్రజల మద్దతు కోల్పోయారు, పార్టీలో నాయకులు ప్రజాభిమానం కోల్పోయారు. సభల్లో మాట్లాడే తీరు పోయి తిట్ల పురాణమే ప్రసంగాలు గా కొత్త భాష్యంతో వెళుతూ అందర్నీ దూరం చేసుకున్నారు. 

పరిస్థితులన్నీ ప్రజానాయకుడినే కోరుకుంటాయి. ప్రజానాయకుడు ఇప్పుడు రంగంలో మరింత ఉత్సాహంతో ముందడుగువేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, రాష్ట్ర అభిశృద్ధి మార్గాలు తెలిసిన నాయకునిగా చంద్రబాబు అధికారంలోకి రావడానికి మార్గాలు తెరుచుకున్నాయి. ప్రజలు తెలుగు దేశుప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారు. బాబుతోనే అన్నీ సాధ్యమన్న నిర్ణయానికి వచ్చే శారు. ఇక ఎన్నికలు రావడమే తరువాయి. జగన్ ను వీలువెంటనే కర్చీ దింపేద్దామని అన్ని ప్రాంతా ల్లోనూ ఓటరు కాచుక్కూర్చున్నాడు.  బాదుడే బాదుడు పేరుతో ప్రభుత్వం మీద తెలుగు దేశం పార్టీ విరుచుకుపడుతోంది. దాంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. దీనితోనే తెలుగుదేశం నాయకులు, కార్య కర్తల మీద వీలున్నపుడల్లా దాడులకు కూడా పూనుకున్నారని విశ్లేషకుల మాట, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా రాజధాని అంశంలో జగన్ సర్కార్ మొండి పట్టు, రైతుల పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవడం వంటివన్నీ కలిసి జగన్ సర్కార్ వైఫల్యాన్ని, ప్రజల విముఖతను తెలియజేస్తున్నాయి. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.