పొలిటికల్ కమేడియన్ పంచ్ పటాకా! ఉంగరం కారూ ఒకటే నంటూ సెటైర్లు
Publish Date:Nov 3, 2022
Advertisement
మునుగోడు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న పొలిటికల్ కమేడియన్ కేఏ పాల్ పోలింగ్ టెన్షన్ లో సైతం నవ్వులు పూయించారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. ఓటర్లు తమ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 2018 ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గంలో 91.38 శాతం ఓటింగ్ నమోదవగా, ఈసారి కొత్త ఓటర్లు కూడా చేరడంతో ఎంత మేరకు పోలింగ్ నమోదు అవుతుందన్నది అందరిలోనూ ఆసక్తి గా మారింది. ఇదిలా ఉంటే మునుగోడు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజాశాంతి పార్టీ అధినేత మునుగోడు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కె ఏ పాల్ సందడి చేస్తున్నారు. ఒక పోలింగ్ కేంద్రం వద్ద 10 వేళ్ళకు 10 ఉంగరాలు పెట్టుకొని వచ్చిన కే ఏ పాల్ ను రిపోర్టర్లు మీది ఉంగరం గుర్తు కదా... చేతికి ఇన్ని ఉంగరాలు పెట్టుకోని రావడం రూల్స్ బ్రేక్ చేసినట్లు కదా అని అడిగారు. దీనికి సమాధానంగా పాల్ టీఆర్ఎస్పై అద్ధిరిపోయే పంచ్ వేశారు. టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నం కారు.. వారు కార్లలో తిరుగుతున్నారుగా, వాళ్లు కార్లలో రాకుండా బైక్స్ మీదగారి సైకిల్స్ మీద వస్తారా అంటూ ప్రశ్నిస్తూనే.. నేను ఇంకో బూత్‌కి వెళ్లి చూడాలి అంటూ కేఏ పాల్ జెట్ స్పీడ్‌లో పరుగులు తీశారు.
http://www.teluguone.com/news/content/political-camedian-paul-satires-on-trs-and-runs-away-25-146502.html





