Publish Date:Feb 10, 2025
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని రోడ్లూ ప్రయాగ్ రాజ్ వైపే అన్నట్లుగా భక్తుల రాక కొనసాగుతుండటంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నిటిలోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం ఇదేనని అధికారులు అంటున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి ట్రాఫిక్ జాం అయ్యింది. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు నానా ఇబ్బందులూ పడుతున్నారు.
ట్రాఫిక్ ఎప్పటికి క్లియర్ అవుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్న పరిస్థితి. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు పోటెత్తారు. అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న వారు ఆకలి దప్పులతో నీరసించిపోతున్న పరిస్థితి. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.
ఇలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మహా కుంభమేళాకు వెడుతున్న భక్తులు అవస్థలు పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే దారిలో ట్రాఫిక్ జాం దృశ్యాల విడీయోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తక్షణమే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా సోమవారం నాటికి మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 44 కోట్లకు చేరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prayagraj-traffic-zam-hundred-kilometers-39-192684.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!