Publish Date:Nov 14, 2025
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత చందంగా తయారైంది ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి తన వ్యూహాలు, ప్రణాళికలతో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమత సర్కార్ కొలువుదీరడానికీ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఆయన స్వయంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రం బీహార్ లో పోటీ చేస్తే.. పాపం ఘోర పరాజయమే ఎదురైంది.
జనసురాజ్ పార్టీ స్థాపించి స్వరాష్ట్రంలో కింగ్ లేదా కనీసం కింగ్ మేకర్ గానైనా నిలుద్దామన్న ప్రశాంత్ కిశోర్ ఆశలకు బీహార్ జనం గండి కొట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ వారిలో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు. రాష్టరంలోని మొత్తం 243 స్థానాల్లో జనసురాజ్ అభ్యర్థులు నిలబడినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. సోంత పార్టీ జన సురాజ్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఇసుమంతైనా పని చేయలేదు. అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం తొలి అడుగులోనే చతికిల పడిందని నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prashant-kishore-misereble-failure-in-bihar-elections-25-209528.html
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.