తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదికగా సంచలన ప్రకటన చేశారు.  తెలుగుదేశం  పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు  పేర్కొన్న ఆయన మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని  చెప్పారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేశ్ తొలిసారిగా మహానాడులో పాల్గొన్నారు. అంతకుముందు రోజు తాను ఒక భారీ ప్రకటన చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమ వేదికగా లోకేష్ చేసిన పోస్టుతో ఆ ప్రకటన ఏమై ఉంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  అందుకు తగ్గట్టుగానే.. పార్టీ అంతర్గత రాజకీయాల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై మహిళా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ  పండుగ  మహానాడు సందర్భంగా  మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు   నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
తెలుగుదేశం   మహానాడు   బుధవారం (మే 27) ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన వేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం  ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగంతో  కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా  మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.  టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  మహానాడు వేదికగా ఆయన   తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఆయన మధ్యాహ్నం 12 గంటలకు  ఓ  భారీ ప్రకటన చేయనున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన వ్యాఖ్యతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అసలు లోకేష్ ఏం ప్రకటన చేయనున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  లోకేష్ పోస్టుపై నెటిజనులు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం సక్సెస్ ఫుల్ గా జరగాలంటూ నెట్టింట లోకేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం (మే 27) హస్తినలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి.  విజయ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతాయి. విజయ్ ఢిల్లీ పర్యటేన కేవలం ఒక మర్యాదపూర్వకంగా మాత్రమే కాకుండా,  తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా  సాగనుందని సమాచారం ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో   రాష్ట్ర  అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చిం చే అవకాశం ఉన్నాయని అంటున్నారు.  ముఖ్యంగా  పారిశ్రామిక  రంగ అభివృద్ధి,  సంక్షేమ పథకాలు,   మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి  కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు.   ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో  కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.  కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై నిర్మలాసీతారామన్ తో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉంది.  బుధవారం ( మే 28) ఉదయమే  చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విజయ్.. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి చెన్నై చేరుకుంటారు.  ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరుపుతున్న తొలి అధికారిక భేటీ కావడంతో, తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర హక్కుల సాధనలో విజయ్ ఎలాంటి ముద్ర వేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన గాంభీర్యమైన వాయిస్, విలక్షణమైన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు అర్జున్ దాస్ (Arjun Das). అయితే గత కొన్ని గంటలుగా సోషల్ మీడియా వేదికగా అర్జున్ దాస్‌కు సంబంధించిన ఒక వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అర్జున్ దాస్ ఈ వారం అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అర్జున్ దాస్ టీమ్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ ఎంగేజ్‌మెంట్ పోస్టులపై, పెళ్లి వార్తలపై పూర్తి స్థాయిలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. అర్జున్ దాస్ నిశ్చితార్థం, పెళ్లి వార్తలలో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ కేవలం బేస్ లెస్ రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని, ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే అర్జున్ దాస్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటారని టీమ్ పేర్కొంది.   
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ మధ్యకాలంలో హారర్, మిస్టరీ థ్రిల్లర్ జోనర్లకు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. విభిన్నమైన సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చే చిత్రాలను వీక్షించడానికి ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్లలో సందడి చేసి, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా తమిళ్ వేదికలపై డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోన్న సరికొత్త సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం 'సాతాన్: ది డార్క్'. తమిళంలో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఒక అందమైన కొండ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉండే పల్లెటూళ్ల నేపథ్యంలో సాగుతుంది. అలీషా (ఐరా) అనే కాలేజ్ చదివే అమ్మాయి, తన తల్లి మెర్సిలిన్ (మోనా బెద్రే), చెల్లితో కలిసి అక్కడ నివసిస్తుంటుంది. అయితే అలీషా చిన్నతనం నుండి వారి ఇంట్లోని ఒక చీకటి గది నుండి వింత శబ్దాలు, కేకలు వింటూ పెరుగుతుంది. అందులో 'విక్టోరియా' అనే వింత శక్తి దాగి ఉందనే విషయం ఆమె మనసులో బలంగా నాటుకుపోతుంది. కొంతకాలానికి అలీషా తల్లి మెర్సిలిన్ ప్రవర్తనలో ఊహించని మార్పులు వస్తాయి. ఏదో తెలియని క్షుద్రశక్తి ఆవహించినట్లుగా ఆమె వింతగా ప్రవర్తిస్తూ, తనను తాను గాయపరుచుకుంటూ ఉంటుంది. తల్లిని కాపాడుకునే క్రమంలో అలీషా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో అలీషా క్లాస్‌మేట్, ఆమెను అమితంగా ప్రేమించే సాగర్ (ఫెడ్రిక్ జాన్) రంగంలోకి దిగుతాడు. అలీషా కుటుంబానికి పట్టిన పీడను వదిలించడానికి ఆమె ఇంటికి వెళ్లి అసలు రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఆ దుష్టశక్తి నుండి అలీషా కుటుంబాన్ని సాగర్ ఎలా కాపాడాడు అనేదే మిగతా చిత్రం. సాధారణంగా హారర్ సినిమాల్లో కూతురిని కాపాడుకునే తల్లి కథలను మనం చాలానే చూశాం. కానీ ఇందులో భిన్నంగా తల్లిని రక్షించుకోవడానికి కూతురు పడే తపనను దర్శకుడు మణికందన్ రామలింగం కొత్తగా చూపించారు. 16వ శతాబ్దపు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి అంశాలతో సినిమాను ప్రారంభించి, క్షుద్ర పూజల వైపు కథను మళ్లించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే విక్టోరియా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నటీనటుల విషయానికి వస్తే.. ప్రధాన పాత్రలు పోషించిన మోనా బెద్రే, ఐరా, చాందినీ తమిళరసన్ తమ నటనతో భయపెట్టే ప్రయత్నం చేశారు. బాలాజీ రామస్వామి సినిమాటోగ్రఫీ లొకేషన్లకు తగ్గట్టుగా బాగుంది. అశ్విన్ కృష్ణ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. అయితే, కథలో అక్కడక్కడా కనిపించే విపరీతమైన హింస, రక్తపాతం, బలుల వంటి సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాపై భిన్నమైన రెస్పాన్స్ వస్తోంది. పాతకాలపు తాంత్రిక పూజల నేపథ్యం బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే మరింత పకడ్బందీగా ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హారర్ చిత్రాలను, క్షుద్ర పూజల కథాంశాలను ఇష్టపడే వీక్షకులు వీకెండ్‌లో టైమ్ పాస్ కోసం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలలో అందుబాటులో ఉన్న ఈ 'సాతాన్: ది డార్క్' చిత్రాన్ని ఒకసారి వీక్షించవచ్చు.
Popular actor-star Pradeep Ranganathan is reportedly expanding his career beyond acting and direction by turning producer for a new film starring Mamitha Baiju in the lead role. The project is already creating curiosity among fans, especially after the strong response received by their previous collaboration. Reportedly, the team has started filming in several real locations around Chennai. Reports also suggest that the shoot would be wrapped up quickly. Also, Mamitha Baiju is busy with multiple projects and she is set to wrap up Nivin Pauly's Betheleham Kudumba Unit in Premalu director Girish AD's direction and Fahad Fassil production at the same time as this one. Hence, she is juggling shooting schedules between Chennai and Keralam.  What makes the film even more interesting is the involvement of Ashwath Marimuthu, best known for directing Oh My Kadavule and Dragon. This time, however, Ashwath is said to be stepping in front of the camera for a prominent role in the film, as a police officer.  The upcoming project will be directed by one of Pradeep Ranganathan’s longtime assistants, and reportedly, it is a thriller that happens over a night. Pradeep taking up production and helping his assistants to become directors is being appreciated but some are advising he should not go down Gautham Vasudev Menon and Vetrimaaran route, who stopped their production houses.  Interestingly, another famous director-turning-actor Lokesh Kanagaraj has stated G Squad and his next big venture in LCU, Benz, is taking its own sweet time to finish. Well, there is no clarity about Pradeep Ranganathan appearance in the film. Will he take up a significant role, make a cameo appearance or stay behind the camera remains to be seen.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual accuracy of the reports. While we do try to do thorough research, some sources could misguide or be untruthful. So, we would encourage viewers' discretion before reacting to them.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్ననాటి వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. అమ్మమ్మ ఊరు, మామిడి తోటలు, స్నేహితులతో కలిసి ఆడే ఆటలు, సైకిల్ ప్రయాణాలు ఇలా ఎన్నో మధురమైన క్షణాలు మన మనసులో నిలిచిపోతాయి. ఇప్పుడు సరిగ్గా అదే నాస్టాల్జియాను, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ వస్తున్న చిత్రం 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays).  ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు వీజీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. శ్రీకర్ నయన్ జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా, ప్రతి ఒక్కరిని తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లేలా ఉంది. (Summer Holidays Teaser) ఈ టీజర్ ప్రారంభంలో ఒక చిన్న పిల్లోడికి(అరుణ్ ) వాళ్ల అమ్మ (వాసుకి) "ఈ సమ్మర్ హాలిడేస్ కి మనం అమ్మమ్మ ఊరికి వెళ్దామా?" అని అడగడంతో కథ పల్లెటూరి వాతావరణంలోకి మారుతుంది. గోదావరి అందాలు, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు వంటి అందమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఊరిలో పేపర్ వేసే ఒక పిల్లాడు(రోహన్), స్కూల్ అయిపోయాక పిల్లలందరూ కలిసి సైకిళ్లపై తిరిగే సీన్లు పక్కా లోకల్ నేటివిటీని ప్రతిబింబిస్తున్నాయి. క్లాస్ రూమ్‌లో సార్ బెత్తం పట్టుకుని వస్తుంటే పిల్లలు చేసే అల్లరి, బెంచీలపై రాసుకునే పేర్లు ఎంతో సహజంగా ఉన్నాయి. వీటికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌ను మరింత అందంగా మార్చింది. సినిమాలో ప్రధానంగా స్నేహం, చిన్ననాటి అల్లరి నేపథ్యంలో సాగే కథాంశాన్ని చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. చిన్నప్పటి ఊరిలోనే పెరిగిన రోహన్, హాలిడేస్ కి ఊరికి వచ్చిన అరుణ్ మధ్య స్నేహం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే క్రికెట్ కిట్ సర్దుకుంటూ అరుణ్ "కాసేపు క్రికెట్ ఆడుకుని వస్తాను డాడీ" అని అడగగా, వాళ్ల నాన్న "ఆడి.. ఇండియా టీమ్ కి ఆడేస్తావా?" అని సెటైర్ వేస్తాడు. దానికి కౌంటర్ అన్నట్టుగా రోహన్ "క్రికెట్ ఆడే ప్రతి ఒక్కడూ భారతదేశానికి ఆడేయాలని ఎక్కడ రాసిపెట్టి లేదు కదండీ" అని ఇచ్చే రిప్లై, దానికి పక్కనున్న వ్యక్తి "కుర్రాడు భలే సురుకు" అని మెచ్చుకోవడం హైలైట్ గా నిలిచింది. టీజర్ ముగింపులో రోహన్, అరుణ్ సైకిల్‌పై వెళ్తూ.. "ఏంటి.. ముడ్డి నొప్పొస్తుందా, కూర్చోలేకపోతున్నావ్.. నువ్వే కాదు నీ పిర్రలు కూడా దూది లాగే ఉన్నాయి" అంటూ ప్యూర్ విలేజ్ స్లాంగ్‌లో మాట్లాడుకోవడం నవ్వులు పూయిస్తోంది.  ఈ చిత్రానికి సింజిత్ యెర్రమిల్లి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగి సినిమాటోగ్రఫీ అందించారు. సంతోష్ నాయుడు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. టీజర్‌లో చూపించిన రోహన్, అరుణ్ ల నటన, శ్రీకర్ నయన్ జి టేకింగ్ చూస్తుంటే ఈ వేసవిలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్‌టైనర్ లభించబోతోందని స్పష్టమవుతోంది.  
  తెలుగు సినిమా వైభవానికి ప్రతీకగా నిలిచే పలు క్రేజీ సినీ అప్ డేట్స్ సినీ ప్రేమికులని పలకరిస్తున్నాయి.   1 .నందమూరి vs అక్కినేని.. 11 ఏళ్ళ తర్వాత బరిలోకి! తెలుగు చిత్రసీమలో దశాబ్దాల చరిత్ర కలిగిన నందమూరి, అక్కినేని కుటుంబాల బాక్సాఫీస్ సమరం మరోసారి పునరావృతం కానుంది. గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ, కింగ్  నాగార్జున రాబోయే 2027 సంక్రాంతి బరిలో నేరుగా తలపడనున్నారనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. నాగార్జున 100వ చిత్రం 'లాటరీ కింగ్' 'NBK 111' ఇందుకు వేదిక కానున్నాయనేది టాక్. మరి ఇదే కనుక నిజమైతే నందమూరి వర్సెస్ అక్కినేని పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. 2 . ధురంధర్ 2 ప్రొడక్షన్ డిజైనర్ పై లైంగిక వేధింపుల కేసు 'ధురంధర్' రెండు భాగాలకి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించిన సైనీ ఎస్. జోహ్రేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం  ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు భాగాలకి  వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఒక యువతీ ,సైనీపై పోలీసులకి ఫిర్యాదు చేస్తూ 'గత ఏడాది సెప్టెంబర్ 10 న చండీగఢ్ లోని ఒక హోటల్ కి రావాలని చెప్తే వెళ్ళాక నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అనారోగ్యంతో ఉన్నా సరే అక్కడ్నుంచి వెళ్లనివ్వలేదు. ఎవరికైనా చెబితే కెరీర్ దెబ్బతింటుందని బెదిరించాడని యువతీ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 3 .వైరల్ గా మారిన ఇరుముడి రిలీజ్ డేట్   మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి'పై ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. 'ఇరుముడి' రిలీజ్ ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఉంటుందనే న్యూస్  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆగస్టు నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులని  పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ రిలీజ్ విండోని లాక్ చేయాలని  చూస్తున్నారనేది టాక్. దీంతో రిలీజ్ టైంలో ఇరుముడికి ఎవరు అడ్డు రాకవడమే మంచిదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి  4 . కరుప్పు ఆ స్టార్ హీరోదా!.. వైరల్ అవుతున్న న్యూస్  'కరుప్పు' కొనసాగిస్తున్న వీరవిహారం కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ కరుప్పుని  మొదట తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కోసం రాసుకున్నాడని, 2023 ఆగస్టులో  విజయ్‌ని కలిసి కథ వినిపించడంతో పాటు కథ వినగానే విజయ్ ఎంతో ఎగ్జైట్ అయ్యారట .మనమే ఈ సినిమా చేద్దాం అని  గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట.  అయితే ఫుల్ స్క్రిప్ట్ కోసం బాలాజీ  చాలా టైమ్  తీసుకోవడంతో  విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేసాడు. దీంతో బాలాజీ విజయ్ కోసం రాసుకున్న కథతో సూర్యని  సంప్రదించారట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5 . ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. ఆ ఏరియాలో పెద్ది సంచలన రికార్డు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో  ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్ కి ముందే ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే నార్త్ అమెరికా, అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న ఈ చిత్రం, తాజాగా యూకే  మార్కెట్లో  ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. రామ్ చరణ్ గ్లోబల్ పాపులారిటీకి అద్దం పడుతూ యూకే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 12,500 పైగా టిక్కెట్లు అమ్ముడైపోవడం ట్రేడ్ వర్గాలని  సైతం విస్మయానికి గురిచేస్తోంది. 6 .మెగాస్టార్‌పై పిచ్చి కూతలు కూస్తే జైలుకే మెగాస్టార్ చిరంజీవి గురించి అవాస్తవాలని ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, ప్రతిష్ట కలిగిన చిరంజీవిపై సదరు ఛానల్ పూర్తిగా బోగస్ కంటెంట్‌తో దుష్ప్రచారం చేస్తోందని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని పోలీసులు నిర్ధారించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను వాడుతూ ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న ఛానెల్ నిర్వాహకులను శిక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 7 .టాక్సిక్ కొత్త డేట్ ఇదేనా! రాకింగ్ స్టార్ యష్ మోస్ట్ అవైటెడ్ వన్ మాన్ షో  'టాక్సిక్'.మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కగా ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ ని  మార్చుకుంది. వాటిల్లో జూన్ 4 కూడా ఒకటి. ఇప్పుడు ఈ మూవీ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతుందని, ఆ లోపు ఓటిటి డీల్ పూర్తి కాకపోతే నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే రూమర్స్ వినపడుతున్నాయి 8 .పెద్దిలో హనుమాన్ సీక్వెన్స్  పెద్దికి సినిమాటోగఫీ అందించిన రత్నవేలు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పెద్దిలోని ఒక సన్నివేశంలో భగవాన్ హనుమంతుడి ప్రస్తావన వస్తుంది . ఆ సీక్వెన్స్  కోసం స్పెషల్ లైటింగ్ డిజైన్ చేశాను. సెల్యులాయిడ్ పై ఆ సీన్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటుకి గురవుతాం. చరణ్ కూడా నిజమైన ఆంజనేయుడిలా కనిపిస్తాడని రత్నవేలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు పెద్ది పై అంచనాలని రెట్టింపు చేసాయి. 9 . నేను బ్లాక్ డ్రెస్ ధరిస్తే జరిగేది ఇదే...త్రిష ఆసక్తికర ట్వీట్    సౌత్ చిత్ర పరిశ్రమలో త్రిషకి ఉన్న స్థానం గురించి తెలిసిందే. ఎన్నో హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా కరుప్పు ఉరఫ్ వీరభద్రుడుతో విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా త్రిష అభిమాని ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా విజయ్, అజిత్, సూర్యతో  చేసిన గిల్లి, మంగత్తా, ఆరు వంటి చిత్రాల్లో త్రిష బ్లాక్ డ్రెస్ ధరించింది. ఆ చిత్రాలు ఆ హీరోల కెరీర్ కే మైలురాయిగా నిలిచాయి. ఇప్పుడు కరుప్పులో బ్లాక్ డ్రెస్ ధరించింది. సూపర్ హిట్ అయ్యిందని పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ కి త్రిష స్మైల్ ఎమోజి లని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 10 . ఫ్యాన్స్‌కి  ఊహించని షాక్.. జూన్ 4న అక్కడ ‘పెద్ది’ రిలీజ్ లేనట్లే! జూన్ 4న రాబోతున్న ‘పెద్ది’ చిత్రం జపాన్ విడుదలకి  బ్రేక్ పడింది. ‘ఆర్ఆర్ఆర్’ తో  వచ్చిన  క్రేజ్ కారణంగా ఇండియాలో రిలీజ్ రోజే జపాన్‌లోనూ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల జపాన్ విడుదల వాయిదా పడినట్లు డిస్ట్రిబ్యూటర్ సంస్థ ప్రకటించింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో జపాన్‌లోని మెగా అభిమానులు, అక్కడ నివసిస్తున్న భారతీయ సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకి లోనవుతున్నారు.  
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న గడ్డు పరిస్థితులను ఆయన ఓపెన్‌గా ఒప్పుకుంటూ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత కొత్త తరంపైనే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays) చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, "నేను చాలా ధైర్యంగా, ఓపెన్‌గా ఒక నిజం చెబుతాను.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ఈ మాట చెప్పడానికి చాలా మంది భయపడతారేమో కానీ ఇది నిజం. ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే మనందరికీ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా మారింది" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో పూర్వపు సందడి కనిపించడం లేదని, ఇలాంటి టైమ్‌లో చిన్న సినిమాలే ఇండస్ట్రీకి శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. కొత్త కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలు ఎంత పెద్ద విజయం సాధిస్తే, ఇండస్ట్రీ అంత హెల్దీగా ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌కు విచ్చేసిన 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్, 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ సాయి మార్తాండ్ వంటి పలువురు సక్సెస్‌ఫుల్ కొత్త తరం డైరెక్టర్లను ఆయన ఇన్స్పిరేషన్‌గా అభివర్ణించారు. చిన్న సినిమాగా మొదలై ఎంతటి సంచలనాలు సృష్టించవచ్చో వీరంతా నిరూపించారని, 'సమ్మర్ హాలిడేస్' చిత్రంతో ఇండస్ట్రీకి వస్తున్న కొత్త డైరెక్టర్ శ్రీకర్ నయన్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా అద్భుతమైన సినిమాలు తీయాలని అన్నారు. ఇక 'సమ్మర్ హాలిడేస్' సినిమా గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో పిల్లల బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటిపోయిందని గుర్తుచేశారు. ఈ సినిమా టీజర్ చూశాక ఫ్యామిలీస్, కిడ్స్ అందరూ ఎంజాయ్ చేసేలా ఉందని, నిర్మాత ధీరజ్ సినిమాపై ఉన్న ప్యాషన్‌తో రిస్క్ అని తెలిసినా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్‌ఫుల్ రూట్ వేసుకుంటున్నాడని అభినందించారు. తన వంశీ పైడిపల్లి కజిన్ అయిన ధీరజ్, గిరి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. చివరగా యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దిల్ రాజు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'సమ్మర్ హాలిడేస్' అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అమ్మమ్మ ఊరేనని, టీజర్ ఓపెనింగ్ కూడా అలాగే చాలా రిలేటబుల్‌గా ఉందని చెప్పారు. తన లైఫ్ లో కూడా సమ్మర్ హాలిడేస్ బెస్ట్ మెమరీస్ అన్నీ అమ్మమ్మ ఇంటి దగ్గరే గడిచాయని దిల్ రాజు చెప్పారు.  
టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ విలన్ సునీల్ (Sunil) ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలోనే మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన ఆయన, ఇప్పుడు కోలీవుడ్, మాలీవుడ్ అంటూ ఇతర భాషల్లోనూ విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా 'కాటాలన్‌' (Kattalan) సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్, తన కెరీర్ టర్నింగ్ పాయింట్ గురించి మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' (Pushpa) సినిమా తన జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పారు. ప్రస్తుతం తన లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్‌లో నడుస్తోందని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ భాష నుంచి, ఎలాంటి విలక్షణమైన క్యారెక్టర్లు వస్తున్నాయో తనకే తెలియడం లేదని అన్నారు. 'పుష్ప' సినిమాలో మంగళం శ్రీనుగా నటించిన తర్వాతే ఇతర పరిశ్రమల దర్శకులు తనను సరికొత్త కోణంలో చూడటం మొదలుపెట్టారని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన బ్రేక్ వల్లే రజనీకాంత్ 'జైలర్' వంటి పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని, కేరళలో షూటింగ్‌కు వెళ్లినా అక్కడి దర్శకులు తనకు మేజర్ రోల్స్ ఇస్తున్నారని సునీల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ 'కట్టాలన్' చిత్రంలో 'మారి' అనే ఒక పవర్‌ఫుల్ తమిళ పాత్రను పోషిస్తున్నట్లు సునీల్ రివీల్ చేశారు. చాలా కాలం తర్వాత తన మనసుకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్ ఇదని ఆయన సంతోషపడ్డారు. ప్రతి నటుడికి సరికొత్త గెటప్‌లో, ఎప్పుడూ చేయని ఒక వైవిధ్యమైన పాత్ర చేయాలనే ఆశ ఉంటుందని, ఈ సినిమాతో తనకు అలాంటి గొప్ప అవకాశం దక్కిందని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా దేవుడి దయ, అలాగే సుకుమార్-అల్లు అర్జున్ ల 'పుష్ప' సినిమా దయ అని సునీల్ కృతజ్ఞతగా చెప్పుకొచ్చారు. ఒకే రకమైన రొటీన్ పాత్రలు కాకుండా, సరికొత్త క్యారెక్టర్లను బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం ఒక నటుడిగా తనకు ఎంతో కిక్ ఇస్తోందని సునీల్ అన్నారు. ఎప్పుడూ చేయని కొత్త పాత్రలు చేసేటప్పుడు మనలో ఒక రకమైన టెన్షన్ ఉంటుందని, ఆ భయంతోనే మరింత కష్టపడి నటిస్తామని, ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ఇచ్చే సంతోషమే వేరని సునీల్ పంచుకున్నారు.   
As part of the “Celebrity Punathanma Challenge,” 'RawKing' Manoj Manchu visited MatruDevobhava Anadha Ashramam and personally helped rehabilitate Santhosh, an orphaned and mentally unstable man. What began as a quiet visit to the ashram soon turned into an emotional interaction that has now begun resonating widely across social media for its humanity, compassion, and emotional honesty. During the visit, Manoj personally helped Santhosh with a complete makeover, arranging a haircut, shave, fresh clothes, and grooming assistance. The visible transformation of Santhosh within a short span of time became one of the most moving moments of the interaction. Looking at him after the makeover, Manoj smiled warmly and said, “Santosh bhai, aap hero jaisa ban gaya, Santosh bhai.” He further asked him whether he liked his new shirt and affectionately encouraged him to smile. Speaking during the interaction, Manoj revealed that MatruDevobhava Anadha Ashramam organiser Giri had first reached out to him nearly two months ago through Instagram and social media platforms. Though occupied with film shoots, announcements, and professional commitments at the time, Manoj said the request stayed with him until he eventually reached out again and decided to personally visit the ashram. Speaking emotionally about the condition of mentally distressed homeless individuals, Manoj said that while orphanages and old-age homes at least receive occasional support and visibility, people wandering on roads in unstable mental conditions are often ignored entirely because of their appearance and behaviour. “Even today, many are treated like untouchables. We are living in 2026. We have solutions, doctors, knowledge and resources. But still, people walk away from them as though they don’t exist,” Manoj said. He further added: “The people who silently walk away after witnessing suffering are the ones truly failing humanity. Within just thirty minutes, you can see how a person slowly regains dignity and acceptance again. I truly hope Santhosh reunites with his family one day.” Deeply affected by what he witnessed at the ashram, Manoj also spoke about wanting to think beyond temporary gestures and move toward long-term rehabilitation systems. The actor revealed that alongside the sports rehabilitation centre he is already planning, he is now also considering developing an inclusive rehabilitation and care facility for mentally challenged and psychologically distressed individuals as well. Stressing the importance of medical support, Manoj said the Telugu community already has many capable doctors and physicians who can contribute meaningfully if more people and organisations come forward collectively. Manoj also assured Giri that AIKYA DHAIRYA SENA SAMITHI would continue extending support to the ashram and its humanitarian efforts in the future. Visibly moved after seeing residents eating meals under trees due to lack of proper facilities, Manoj immediately promised to arrange tables and chairs for the ashram at the earliest. Organiser Giri emotionally thanked Manoj for personally visiting the ashram and standing by his word despite public speculation over whether he would be able to come. He revealed that Santhosh had been wandering around Chaderghat for nearly two years before eventually reaching the ashram and added that there was a time when he would not even respond properly when food was offered to him. “If we dedicate even thirty minutes with patience and humanity, a person can slowly return to dignity again. Today society may begin looking at him differently,” Giri said emotionally. Giri further explained that the ashram is currently focused on rehabilitating abandoned men but hopes to eventually expand support systems for women as well. He also requested Manoj’s assistance in arranging psychiatric support for residents, explaining that transporting mentally distressed individuals for treatment has remained one of the organisation’s biggest challenges. Calling Manoj the first film actor to personally visit and spend time at the ashram in this manner, Giri thanked the actor and his family for extending support, compassion, and visibility toward people who are otherwise forgotten by society. On the professional front, 'RawKing' Manoj Manchu is currently balancing both cinema and social outreach simultaneously. While the large-scale action film David Reddy is progressing rapidly with nearly 40% of the shoot completed, Rakshak is gearing up for its grand launch. Alongside this, Manoj is also working on Mohana Raga, while continuing to focus on his physical transformation and upcoming slate of projects currently in different stages of production and development. With AIKYA DHAIRYA SENA SAMITHI gradually expanding its social outreach activities and Manoj simultaneously entering a strong new phase professionally, the actor’s recent visit to MatruDevobhava Anadha Ashramam has now become a powerful reminder that even the simplest acts of compassion can leave a lasting emotional impact. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)చేసుకున్న పుణ్యమో,లేక మేకర్స్ చేసుకున్న పుణ్యమో గాని అభిమానులు, ప్రేక్షకుల్లో 'ఇరుముడి'(irumudi)పై ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రవితేజ అంటేనే హై వోల్టేజ్ మాస్, పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇరుముడితో సిల్వర్ స్క్రీన్ ని తన నుండి మరో కొత్త రకం బాడీ లాంగ్వేజ్ ని పరిచయం చేస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని  క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ దర్శకుడు శివ నిర్వాణ(Siva Nirvana) సరికొత్త రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, అద్భుతమైన భక్తి భావన కలగలిపి ఉండబోతున్నాయి. ప్రెజెంట్ సోషల్ మీడియాలో 'ఇరుముడి' రిలీజ్ కి  సంబంధించిన  సెన్సేషనల్ అప్‌డేట్  వైరల్ అవుతోంది.  రిలీజ్ ని ఈ ఏడాది  ఆగస్టు నెలలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది. ఆగస్టు నెలలో ఉండే లాంగ్ వీకెండ్స్, పండుగ సెలవులని  పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ రిలీజ్ విండోని  లాక్ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం సినిమా పనులను చిత్ర యూనిట్ జెట్ స్పీడ్‌లో వేగవంతం చేసింది. శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని,నెల రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది.  ఆ వెంటనే  పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా ముగించి ఆగస్టు బాక్సాఫీస్ బరిలో  నిలపాలనే  ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇటీవలి కాలంలో రవితేజ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈ సరికొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ 'ఇరుముడి'తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని,ఆ టైంలో ఇరుముడికి ఎవరు అడ్డు రాకవడమే మంచిదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. Also read: kajal aggarwal: వైరల్ గా మారిన కాజల్ పిక్స్.. అసలు పెళ్లి అయ్యిందా!   రవితేజ సరసన అందాల నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా చేస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ  'మైత్రీ మూవీ మేకర్స్' ఖర్చు విషయంలో వెనుకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి ప్రాణం పోసేలా అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా త్వరలోనే భారీ ఎత్తున ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది.     
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (Peddi) చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచే అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి, రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనే విషయాలపై సోషల్ మీడియాలో నిత్యం రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు సంబంధించి లీక్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మెగా అభిమానుల్లో ఒక సంచలనంగా మారింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రంలో ఒక అద్భుతమైన సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో భగవాన్ హనుమంతుడి ప్రస్తావన (Hanuman Reference) వస్తుందని వెల్లడించారు. ఆ పర్టికులర్ సీక్వెన్స్ కోసం ఆయన ఒక స్పెషల్ లైటింగ్ డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు ఆ సీన్‌ను వెండితెరపై చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒళ్లు గగుర్పొడిచే అనుభూతిని (Goosebumps) పొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, ఆ నిర్దిష్ట సన్నివేశంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఆయనలోనే సాక్షాత్తు ఆ హనుమంతుడు కనిపిస్తాడని రత్నవేలు ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. హీరో ఎలివేషన్ సీన్లలో ఈ హనుమాన్ రిఫరెన్స్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతోందని ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా  ఎక్కువ సేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిలో పని చేస్తున్నప్పుడు, శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది.  చాలా మంది ఖరీదైన డియోడరెంట్లు , పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు, కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను ఉత్పత్తి చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా శరీర దుర్వాసనను వదిలించుకోవాలనుకుంటే, కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి.  ఆ సులభమైన ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే.. వేసవిలో శరీర దుర్వాసన ఎందుకు పెరుగుతుంది? వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, దుర్వాసన వెలువడుతుంది. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే లేదా చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండిపోతే, శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. శరీర దుర్వాసన రాకూడదంటే.. స్నానం నీటిలో వీటిని కలపాలి.. నిమ్మరసం.. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. చెమట వాసనను తగ్గించవచ్చు ఒక బకెట్ నీటిలో ఒకటి రెండు స్పూన్ల నిమ్మ రసం కలుపుకుని స్నానం చేయడం వల్ల రిఫ్రెషింగ్  అనుభూతి కలుగుతుంది. రోజ్ వాటర్.. గులాబీ నీరు చల్లదనాన్ని, తేలికపాటి సహజ సువాసనను అందిస్తుంది.  స్నానపు నీటిలో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.  ఇది చర్మానికి తాజా అనుభూతిని కూడా కలిగిస్తుంది. వేసవిలో శరీర జిగట తగ్గిస్తుంది. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది.  అయితే దీన్ని అధిక పరిమాణంలో ఉపయోగించకూడదు.  సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి. పటిక.. పటికలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇది చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప నీరు.. వేప నీరు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. దురద , బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.  వేప ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు.                                  *రూపశ్రీ.  
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ  వడగాలులు మరింత తీవ్రతరం కాబోతున్నాయి. నౌతప ఎంటర్ అయ్యింది. ఇది మే 25న ప్రారంభమై, జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజులలో గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయట, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. నౌతప అనేక విధాలుగా అవసరమైనదనే చెబుతారు. ఇది పొలాల్లోని హానికరమైన కీటకాలను, తెగుళ్లను నాశనం చేసి, పంట నష్టాన్ని నివారిస్తుంది, ఈ తొమ్మిది రోజులు ఆరోగ్య పరంగా చాలా సవాలుగా ఉంటాయి. ఇప్పటికే తీవ్రంగా ఉన్న వేడికి తోడు ఈ తొమ్మిది రోుల  సమయంలో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది వడదెబ్బ , డీహైడ్రేషన్ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అనేక ప్రాంతాలలో నౌతప సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 45 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతాయి, ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో  ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న. నౌతప సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అబిప్రాయం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నౌతప అందరికీ ప్రమాదకరమైనప్పటికీ, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు,  ముందు నుంచే గుండె మరియు మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ , ఎండదెబ్బ, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, అలసట, నిద్ర సమస్యలు , చిరాకును గణనీయంగా పెంచుతాయి. తీవ్రమైన వేడి కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల కాలం గుండె , మూత్రపిండాల రోగులకు ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. తీవ్రమైన వేడి కారణంగా గుండె దడ , గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగవచ్చు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? నౌతప సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరు , ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, ఎండకు దూరంగా ఉండటం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు , గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బలహీనంగా ఉంటుంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి. ఈ సమయంలో లేత రంగు దుస్తులు ధరించడం, పుష్కలంగా నీరు త్రాగడం , శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ తొమ్మిది రోజులు ఇవి తప్పనిసరిగా చేయాలి.. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి దాహం వేయకపోయినా రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం. నీటితో పాటు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ , ఓఆర్ఎస్ (ORS) తాగాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. తేలికపాటి భోజనం చేయడం ఉత్తమం. పుచ్చకాయ, దోసకాయ, కర్బూజా , పెరుగు వంటి ఆహారాలు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా టవల్ ఉపయోగించాలి. ఈ తొమ్మిది రోజులు ఏం చేయకూడదు? తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి, ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, శరీరాన్ని పూర్తీగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.  అలాగే గొడుగు వాడాలి. అధికంగా టీ, కాఫీ , మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత పెరగవచ్చు. కాబట్టి వాటిని చాలా తగ్గింతాలి. మూసివున్న, వేడి గదిలో ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదకరం. అధిక జ్వరం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి వడదెబ్బకు సంకేతాలు కావచ్చు.                                       *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల యువతలోనూ వేగంగా విస్తరిస్తోంది. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? కుటుంబంలో ఒకరికి ఉంటే మిగతా వారికి కూడా వస్తుందా? (Family Cancer Syndromes). దీనికి గల కారణాలు, అధునాతన చికిత్సల గురించి నిమ్స్ (NIMS) హాస్పిటల్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ మరియు అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జి. సూర్యనారాయణ రాజు (Dr. GSN Raju) గారు ఈ VIDEO లో అందించిన పూర్తి వివరాలు మీకోసం... క్యాన్సర్ అంటే ఏమిటి? (What is Cancer?) మన శరీరంలో కోట్లాది కణాలు ఉంటాయి. ఇవి క్రమపద్ధతిలో విభజన చెందుతూ, పాత కణాలు చనిపోయాక కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ, ఈ కణాల విభజన ప్రక్రియపై నియంత్రణ తప్పినప్పుడు, కణాలు అసాధారణంగా, అమితంగా పెరిగిపోతాయి. అలా పెరిగిన కణాల సమూహాన్నే గడ్డలు లేదా ‘ట్యూమర్లు’ అంటారు. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడు దానిని క్యాన్సర్ (Malignant) గా గుర్తిస్తారు. ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటే ఏమిటి? (Family Cancer Syndromes / Hereditary Cancer) చాలా మందిలో ఉండే పెద్ద అనుమానం—"మా కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంది, అది మాకు కూడా వస్తుందా?". డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారి వివరణ ప్రకారం, అన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. కేవలం 5 నుండి 10 శాతం క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన లోపాలు (Genetic Mutations) తర్వాతి తరాలకు బదిలీ అవ్వడం వల్ల వస్తాయి. దీనినే 'ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్' అంటారు. ముఖ్య లక్షణాలు: కుటుంబంలో ఒకే తరానికి చెందిన ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ రావడం, చాలా తక్కువ వయసులోనే (ఉదాహరణకు 30 లేదా 40 ఏళ్లకే) క్యాన్సర్ బారిన పడటం, లేదా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు (ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ రెండూ) రావడం వంటివి జరిగితే అది వంశపారంపర్య క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణలు: బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్), ఒవేరియన్ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్), మరియు కోలోరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) లలో ఈ వంశపారంపర్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు (Causes of Cancer) వంశపారంపర్య కారణాలు కాకుండా, మిగిలిన 90% క్యాన్సర్లకు మన చేతులారా చేసుకునే పొరపాట్లే కారణమని డాక్టర్ గారు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి: ధూమపానం మరియు మద్యపానం: సిగరెట్లు, బీడీలు తాగడం, గుట్కా నమలడం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం: జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, మైదా, అతిగా వేయించిన మాంసాహారం తీసుకోవడం. స్థూలకాయం (Obesity): శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. రసాయనాలు & కాలుష్యం: ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయనాలు, పురుగుమందుల ప్రభావం ఉన్న ఆహార పదార్థాలు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), హెపటైటిస్-B వంటి వైరస్ల వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స (Diagnosis and Treatment) క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే 100% నయం చేయవచ్చని డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారు స్పష్టం చేశారు. కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారు ముందుగానే 'జెనెటిక్ స్క్రీనింగ్' (Genetic Testing) మరియు క్రమంతప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం వైద్యరంగంలో అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి: సర్జరీ (Surgery): క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం. కీమోథెరపీ (Chemotherapy): శక్తివంతమైన మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం. రేడియేషన్ థెరపీ (Radiation Therapy): హై-ఎనర్జీ ఎక్స్-రేల ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడం. ఇమ్యునోథెరపీ (Immunotherapy): శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌తో పోరాడేలా చేయడం. క్యాన్సర్ పట్ల భయం వద్దు... అవగాహన ముఖ్యం! సరైన జీవనశైలిని అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. జీవనశైలి సరిగా లేకపోవడం,  ఊబకాయం,  శారీరక శ్రమ తక్కువగా ఉండటం లేదా అసలు శారీరక శ్రమ లేకపోవడం కీళ్ల వాతానికి దారి తీస్తుంది.  కీళ్లవాతం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే.. కొన్ని పనులు చేయాలి.  అవేంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని చెబుతూ ఉంటారు.  దీన్ని బిఎమ్ఐ అని చెబుతారు. అయితే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువ బరువు ఉండే అధిక బరువు అంటారు.  ఈ అధిక బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఊబకాయం అని అంటారు.  కీళ్లవాతం సమస్య ఎక్కువగా ఊబకాయం ఉన్నవారికే వస్తుంది.  అందుకే కీళ్లవాతం రాకూడదంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి.  బరువును అదుపులో ఉంచుకోవాలి.  అదిక బరువు సమస్యలు.. అధిక బరువు ఉంటే మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. పరిష్కారం.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే వాకింగ్,  యోగా,  స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయాలి.  ఇది కీళ్లను బలపరుస్తుంది. కీళ్ల వాతం రాకుండా చేస్తుంది. ఎముకల బలం.. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల వాతం కూడా అంత సులువుగా రాదు.  అందుకే ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం,  విటమిన్-డి ఉన్న ఆహారాలు చాలా బాగా తీసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్.. నేటికాలంలో ఉద్యోగాలు అన్నీ ఒకేచోట కూర్చుని చేసేవే.  ఈ సిట్టింగ్ వర్క్ వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్రి పెరగడానికి దారితీస్తుంది. అందుకే సిట్టింగ్ వర్క్ చేసేవారు కనీసం అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దీనివల్ల కీళ్లు రిలాక్స్ అవుతాయి. ఆహారం.. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో వాపును పెంచడం ద్వారా కీళ్ల సమస్యలకు కారణం అవుతాయి.  అందుకే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తక్కువగా లేదా అసలు తీసుకోకుండా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ.