ఇండియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. మరో వైపు భారత వాణిజ్య విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఈ రెండు నాలుకల ధోరణి అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు విడదీయరాని మైత్రి ఉందని చెప్పుకొచ్చారు. మోదీ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడనీ, ఆయనతో తనకు బలమైన అనుబంధం ఉందనీ చెప్పిన ట్రంప్ ఇరు దేశాలు ప్రస్తుతం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని, త్వరలోనే ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అయితే.. ప్రధాని మోడీతో స్నేహాన్ని గురించి చెబుతూ, ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతూనే.. భారత్ గతంలో అనుసరించిన వాణిజ్య విధానాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. గతంలో భారత్ భారీ సుంకాలను విధిస్తూ అమెరికాను వాణిజ్యపరంగా పూర్తిగా వాడుకుందన్నారు. ఏళ్ల తరబడి భారత్ అమెరికాను ఒక గొప్ప అవకాశంగా మలుచుకుందని, అమెరికా నుంచి వచ్చే వస్తువులపై భారీగా పన్నులు మోపిందనీ, దీనివల్ల అమెరికా గతంలో నష్టపోయిందనీ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు కాలం మారిందనీ.. ప్రస్తుతం తాము భారత్‌తో అత్యంత లాభదాయకమైన వాణిజ్యాన్ని సాగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు, సుంకాలు, ఇతర క్లిష్టమైన ఆర్థిక అంశాలపై అమెరికా, భారత ఉన్నతాధికారులు ఇటీవల సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నాలుగు రోజుల పాటు అత్యంత కీలకమైన వాతావరణంలో జరిగిన ఈ చర్చలు సానుకూల ముగింపుకు వచ్చాయి. ఈ చర్చలు ముగిసిన అనంతరం వైట్‌హౌస్ నుంచి ట్రంప్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ఒకే సమయంలో వ్యూహాత్మక మైత్రిని, వాణిజ్య వైరుధ్యాన్నీ చాటడంపై పరిశీలకులు ఆక్షేపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/praise-36-221872.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.