హడావుడి నిర్ణయమా? లేక వెల్ ప్లాన్డ్ డెసీషనా?

Publish Date:Aug 27, 2016

Advertisement

అభిమాని హత్యకి గురైతే తిరుపతికి వెళ్లిన పవన్ హఠాత్తుగా సభ అంటున్నారు? అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయంగా పవన్ సభ పరిణామాలు ఎలా వున్నా... ఒక్కటి మాత్రం స్పష్టం! పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిలా కాక సినిమా హీరోలానే ఆలోచిస్తున్నారు. అదే ఆయనకు ప్లస్ , మైనస్ ఏదైనా అవ్వొచ్చు! సినిమా చూసే ప్రేక్షకుడు నెక్స్ట్ సీన్ ఇలా వుంటుంది అని ఊహిస్తాడు. కాని, అతడు అనుకున్న దానికన్నా భిన్నంగా సీన్ వస్తే షాకవుతాడు. తరువాత డైరెక్టర్ తెలివిని మెచ్చుకుని సినిమా హిట్ చేస్తాడు. ఇదే సూత్రం పాలిటిక్స్ లోనూ వర్తిస్తుంది అనుకుంటే పొరపాటే!

 


రాజకీయాల్లో అనూహ్య నిర్ణయాలు అన్ని సార్లూ పనికి రావు. కొన్ని సార్లు జనం అద్భుతం అంటూ మెచ్చుకోవచ్చేమోగాని పవన్ లాగా అమాంతం బహిరంగ సభలు వగైరా వగైరా అంటే కొంచెం ఇబ్బందే! పవర్ స్టార్ హీరో కాబట్టి జనం రావటం కష్టం కాదు. బిర్యానీ, బీర్ బాటిల్ లెక్కలు ఈ సభలో వుండవు. కాని, జనం వచ్చాక పవన్ ఏం మాట్లాడతారు? జస్ట్ మూడు రోజులుగా తిరుపతిలోనే మకాం వేసి చర్చోపచర్చలు జరిపిన ఆయన పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి చెప్పేదేముంది? దగ్గర్లో ఎలాంటి ఎన్నికలు కూడా లేనప్పుడు ప్రెస్ మీట్ తో పోయేదాన్ని బహిరంగ సభ దాకా ఎందుకు లాక్కెళ్లాలి? అంత అవసరమే వుంటే బహిరంగ సభలు చంద్రబాబు, జగన్, కేసీఆర్ లాంటి వాళ్లు పెట్టలేకా? వాళ్లు కూడా సైలెంట్ గా ఎందుకు వున్నారు? ఎందుకంటే , ఇప్పుడు అనవసరంగా వేడి రాజేసి మాత్రం చేసేదేం లేదు. ఈ విషయం పవన్ కి తెలియదా?

 


పవన్ ఇప్పుడు బహిరంగ సభ పెట్టడం ద్వారా ఎంత హడావిడి జరిగేలా చూసినా ఎన్నికలు వచ్చేదాకా ఇదే టెంపో మెయిన్ టైన్ చే్స్తారా? మూడేళ్ల పాటూ పవన్ వరుసగా సభలైతే పెట్టలేరు కదా? ఇవాళ్ల సభ తాలూకూ  వేడి మహా అయితే ఓ పది రోజులు వుండి చల్లారిపోతుంది. పవన్ కూడా తాను కమిటైన సినిమాల షూటింగ్ లో పాల్గొనాలి.. అంటే మళ్లీ కొన్నాళ్ల పాటూ పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి అదృశ్యం కావాల్సిందే! ఇంత మాత్రం దానికి అమాంతం సభ పెట్టి సాధించేదేముంది?


 
పవన్ రాజకీయ ప్రవేశం పై ముందు నుంచీ పెద్దగా సుముఖంగా లేని విశ్లేషకులు ఇలాంటి బోలెడు ప్రశ్నలు వేస్తున్నారు. కాని పవన్ మనసులో ఏముందో తెలియాలంటే సభ జరిగేదాకా ఆగాల్సిందే. ఆ తరువాతే పవర్ స్టార్ తన ఫుల్ టైం ఎంట్రీ ప్రకటిస్తారా? లేక ఊరికే అభిమాని హత్యకు సంబంధించి మాట్లాడి, ప్రత్యేక హోదాపై నాలుగు కామెంట్లు చేసి స్టేజ్ దిగేస్తారా? తెలిసిపోతుంది!

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.