వాకింగ్ ట్రాక్ లుగా చెరవుకట్టల అభివృద్ధి
Publish Date:Oct 1, 2024
Advertisement
రోజూ ఓ గంట సేపు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెబుతారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు తీసుకునే చర్యలలో భాగంగా నగరాలు, పట్టణాల్లో వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేస్తున్నాయి.కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో అవి తప్పని సరిగా ఉంటున్నాయి. మరి సామాన్యులు వాకింగ్ చేయాలంటే.. అందరికీ వాకింగ్ ట్రాక్ లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గుంటూరు కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించింది. కార్పొరేషన్ పరిధిలోని చెరువు కట్టలను వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. సమ్మర్ పేట చెరువుని పరిశీలించిన మునిసిపల్ కమిషనర్ ఈ చెరువు కట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని అన్ని చెరువుకట్టలనూ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. సమ్మర్ పేట చెరువులో కట్ట ఏర్పాటు చేశామని, త్వరలో ఫెన్సింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. చెరువులు ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
http://www.teluguone.com/news/content/pond-embankments-as-walking-tracks-25-185968.html





