రాజ‌మార్గం.. ఒక‌రికి గ‌రుకు, ఒక‌రికి మెరుగు

Publish Date:Jul 13, 2022

Advertisement

కొంప‌లు అంటుకుంటేనే రాజుగారికి మంత్రి, సైన్యాధిప‌తి బాగా గుర్తుకు వ‌చ్చేది. వారి మాట‌, అవ‌స‌రం అప్పుడే శిరోధార్య‌మ‌వుతుంది. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప‌రిస్థితీ అంతే. మూడేళ్ల పాల‌న తాలూకు రిపోర్టు ఏమాత్రం బాగోలేద‌న్న‌ది ప్ర‌జ‌లే మార్కులేసి మ‌రీ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల‌ను  పిలిచి టిఫిన్లు పెట్టి చిన్న‌పాటి హెచ్చ‌రిక‌లూ చేశారు

జ‌గ‌న్‌. తొలి విడ‌త‌లో మంత్రిప‌ద‌వులు ఇవ్వ‌ని వారికి మూడేళ్ల త‌ర్వాత వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డానికి కొంద‌రిని ప‌దవి నుంచీ దించేశారు. అయినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. అంత‌టా నిర‌స‌నే వెల్లువెత్తుతోంది. మ‌రో వంక ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం తెలుగు దేశంలో నూత‌నో త్సాహం వెల్లువెత్తుతోంది. వైసీపీ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల విముఖ‌తను టీడీపీ అనుకూలం చేసుకోవ డంలో  ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. స‌భ‌లు, స‌మావేశాలు, రోడ్డు షోల‌తో ప్ర‌భుత్వం ఎంత ప‌నికి మాలినిదిగా మారింద న్నది ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈసారి జ‌గ‌న్‌ను ఇంటికి పంప‌డానికి తెలుగు త‌మ్ముళ్లు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ ప‌రంగా త‌మ అధినేత ఆదేశాలు తూ.చ త‌ప్ప‌క పాటిస్తూ మంచి జోరులో ముంద‌డుగు వేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో  వైసీపీ గత ఎన్నికలలో అనుసరించిన వ్యూహాల తో పాటు కొత్త వ్యూహలు, కొత్త పద్దతుల కోసం అన్వేషిస్తోంది. తెలుగుదేశం పార్టీ గ‌త‌ ఎన్నికలలో జరిగిన తప్పులని సరిద్దిద్దుకుంటూ, సరికొత్త వ్యూహాలతో ముందుకి వెళ్తోంది. అలాగే  కొత్త వ్యూహకర్తలని, సలహాదారులని తీసుకుంటున్నాయ్.  ఎన్ని కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అయినా పార్టీలు మాత్రం అందుకోసం సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండమని  క్యాడర్ ను కోరుతున్నాయి. అదే సమయంలో వైసీపీ పాత వ్యూహంతో ఈ సారి కూడా ముందుకెళ్లే పరిస్ధితులు లేవు. అప్పట్లో చంద్రబాబును  అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా పీకే సాయంతో పలు వ్యూహాలు రచించిన వైసీపీ ఇప్పుడు  మాత్రం కేవలం తన సంక్షేమ పధ‌కాలని నమ్ముకుని  బరిలోకి దిగాల్సిన పరిస్ధితి. అయితే సంక్షేమంలో లోటు పాట్లు  కొంప ముంచుతాయనే భయం వెంటాడుతోంది.  

సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌త్యేకించి  ఒరిగేదేమీ లేద‌న్న అభి ప్రాయంలో వుంది. అందుకే ఇంతకు మించిన కొత్త వ్యూహాన్ని తయారు చేయాలని వ్యూహకర్త  రిషి రాజ్ సింగ్ ను జగన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం  కొత్తగా  రిక్రూట్ మెంట్లు కూడా  భారీ ఎత్తున చేపడుతోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో  పరాభవం తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీని  నామ రూపాల్లేకుం డా చేసి తిరిగి లేవనీయకుండా చేయాలన్న‌ జగన్ ప్రయత్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతున్నాయి.  దీనికి  ప్రధాన కారణం రాష్ట్రంలో టీడీపీ కంటే బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడమే. అలాగే  క్షేత్ర స్ధాయిలో ఆ పార్టీకి ఉన్న క్యాడర్ తో పాటు నేతలు కూడా ఆ పార్టీకి ఊపిరి. అయితే వ్యూహం మాత్రం ఖరారు కాకపోవ డంతో టీడీపీ తీవ్రంగా పాట్లు పడుతోంది.

అయినా తెలుగుదేశం పార్టీ కి సంక్షోభాలు  కొత్త కాదు, ఇలాంటి సందర్బాలలో చంద్రబాబు తన రాజనీతి తో పార్టీ ని గ‌ట్టెక్కించారు. చంద్రబాబు  పరిపాలనా దక్షత ని చూసిన వారికీ ఎవరికైనా తెలుస్తుంది. సంక్షోబాన్ని అవకాశంగా మార్చుకోవడంలో చంద్ర బాబు దిట్ట.  ఈ విషయం ఆయనే చాల సందర్బాలలో చెప్పారు. ఏపీలో మారుతున్న పరిస్ధితుల్లో ఇన్నాళ్లూ వైసీపీకి అండగా నిలిచి, ఆ పార్టీ సాయం తీసుకున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనసు మార్చు కునేలా కనిపిస్తోంది. వైసీపీని మాత్రమే నమ్ముకుంటే రేపు టీడీపీ వైపు జనం మొగ్గితే పరిస్ధితి ఏమిటన్న భయం బీజేపీలో మొదలైంది.

దీంతో తాజాగా తమ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పా టు చేసిన ఆత్మీయ భేటీకి బీజేపీ నేతలు సోము వీర్రాజు, కిషన్ రెడ్డి హాజరయ్యారు.చంద్రబాబుకు ధన్యవా దాలు కూడా తెలిపారు.చంద్రబాబు కూడా మోడీని  అభి నందించారు. దీంతో మోడీ మద్దతు వైసీపీకా, టీడీపీకా అన్న ప్రశ్న తలెత్తింది.  

రాష్ట్రపతి  ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం  తెలి సిందే. అత్యున్నత పదవిలో ఓ గిరిజన మహిళకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తాము ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.  ఇప్పటికే చంద్రబాబు నియజక వర్గాలలో తిరుగుతూ కార్యకర్త లలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. పని చేసిన వారికే పదవులని,యువతకి 40 % అవకాశాలు ఇష్టం అని, కష్టపడిన వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.చంద్రబు కూడా తన కొత్త వ్యుహలతో వచ్చే ఎన్నికలలో బరిలోకి వస్తున్నారు అని రాజకీయ విశ్లేషకుల మాట.

By
en-us Political News

  
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.