ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. టాప్ ఫైవ్ లో కేసీఆర్

Publish Date:Jul 13, 2022

Advertisement

రాజకీయ నాయకులూ అన్న తర్వాత కేసులు ఉండడం సహజం. అందులోనూ, పుష్కర కాలం పైగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పై క్రిమినల్ కేసులు ఉండడం, విశేషం కాదు. కానీ, తెలంగాణ ఉద్యమం ముగిసి, రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా, ఇంకా, అయన పై  అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదలా ఉంచితే..  దేశంలో, అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ టాప్ ఫైవ్  ప్రజా ప్రతినిధుల్లో కేసీఆర్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో, అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో కేసీఆర్ పేరు ఐదవ స్థానంలో వుంది.  

ఈనెల 18న  జరిగే రాష్ట్ర పార్టి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, ఎంపీల నేర చరితను, వారిపై ఉన్న కేసుల వివరాలను, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు విడుదల చేశాయి. ఈ రెండు ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు విడుదల చేసిన నివేదికల ప్రకారం  ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది.. ఏడీఆర్ నివేదొక ప్రకారం, కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అందులో ఇంచుమించుగా సగానికి పైగా (37)  తీవ్ర నేరాలకు పాల్పడిన కేసులున్నాయి. అందులో కొన్ని కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో.. మహిళా ఉద్యోగిని విధులను అడ్డుకోవడం, గాయ పరిచే ప్రయతనం చేయడం (ఐపీసీ సెక్షన్-506)కి సంబంధించి నాలుగు కేసులతో పాటుగా హత్యాయత్నానికి సంబంధించి  13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన కేసులున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు అడ్డుకోవ‌డం, గాయపరచడానికి ప్ర‌య‌త్నించ‌డానికి సంబంధించిన 4 అభియోగాలు, హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు, ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించిన, 'స్నాచింగ్స‌ నేరాలకు సంబదించి మూడు అభియోగాలు ఉన్నాయి. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు, ఇలా కేసీఆర్ పై మొత్తం 13 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులే ఉన్నాయి. 

ఇక ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికల ప్రకారం అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో తమిళనాడుకు చెందినా డీఎంకే ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.