గేమ్ ఛేంజ‌ర్ చుట్టూ పొలిటిక‌ల్ వార్‌.. వైసీపీ నేత‌ల‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌!

Publish Date:Jan 6, 2025

Advertisement

ఏపీలో వైసీపీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. స‌రిగ్గా కూట‌మి పార్టీలు గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీలో ఒక‌రిద్ద‌రు   మిన‌హా మిగిలిన వారంతా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయినా, వైసీపీ అధిష్టానం తీరు మార‌డం లేదు. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుప‌ట్ల వైసీపీ శ్రేణులే తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయి.  రెండు రోజుల క్రితం రాజ‌మండ్రి వేదిక‌గా గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సినిమాలో హీరోగా మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ వెంట్ కు ముఖ్యఅతిథిగా జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. అయితే, ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో ఈవెంట్లో పాల్గొన్న మెగా ఫ్యాన్స్‌కు ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని ప‌దేప‌దే సూచించారు. అయితే దుర‌దృష్ట‌వ శాత్తూ ఈవెంట్ ముగిసిన అనంత‌రం ఇంటికి వెళ్తున్న క్ర‌మంలో రాత్రివేళ ఇద్ద‌రు యువ‌కులు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆ ఇద్ద‌రు యువ‌కుల మృతిని రాజ‌కీయం చేసేందుకు వైసీపీ నేత‌లు ప‌డ‌రానిపాట్లు ప‌డుతున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ రెచ్చిపోతున్నారు. దీంతో ఇదేం పార్టీరా బాబూ అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి నెల‌కొంది.

  గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అధికారంలో ఉంది. ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించాడు. రాష్ట్ర అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి దోచుకోవ‌టం, దాచుకోవ‌ట‌మే పాల‌న అన్న‌ట్లుగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన అరాచకత్వంతో అన్ని విధాలుగా భ్రష్ఠు పట్టించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లూ తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్ర‌జ‌లు వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్షంగా ఉండే అర్హత కూడా లేదని తమ తీర్పు ద్వారా తేటతెల్లం చేశారు.  దీనికి ప్ర‌ధాన కార‌ణం వైసీపీలోని కొంద‌రు నేత‌లు నోటికొచ్చిన‌ట్లు బూతుల‌తో  ప్రత్యర్థి పార్టీల నేతలను తూల‌నాడ‌టం, ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మంగా కేసులు పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి జైళ్ల‌కు పంప‌డం.   కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు. కానీ, వైసీపీలోని కొంద‌రు నేత‌ల తీరు మాత్రం మార‌లేదు. అవ‌స‌రంలేని విష‌యాల‌ను రాజ‌కీయం చేయాల‌ని చూస్తుండ‌టంతో వారిప‌ట్ల‌ సొంత పార్టీ కార్యకర్తలే మండిప‌డుతున్నారు.

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రైన వెళ్తుండ‌గా.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ, చరణ్ అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాల‌కు నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఇదే క్రమంలో గత వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని.. గత అయిదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పాడైపోయిన ఈ రోడ్డును ప్రస్తుతం బాగు చేస్తున్నామన్నారు. అయితే, ఈ దశలో ఏడీబీ రోడ్డుపై ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యానంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట‌్ పై వైసీపీ నేత‌లు రోజా, అంబ‌టి రాంబాబులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. 

ప‌వ‌న్ ట్వీట్‌కు రోజా స్పందిస్తూ.. మానవత్వం మరిచి నిందలేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని వెళ్తుండ‌గా ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించి మూడు రోజులైనా వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమంటూ రోజా ట్వీట్ చేశారు. వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ రాజకీయం చెయ్యడం తగునా పవన్ కళ్యాణ్ అంటూనే.. ఏడు నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీరే.. రోడ్డు వేయ‌కుండా మ‌రి మీరేం చేస్తున్నార‌ని  ప్ర‌శ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. పుష్ప సినిమాకు ఏమో నీతులు, గేమ్ ఛేంజర్‌కు పాటించరా అంటూ ట్వీట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మండిప‌డుతున్నారు. 

పుష్ప‌-2 సినిమా సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఒక న్యాయం.. గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చివెళ్తూ మ‌ర‌ణించిన వారికి ఒక‌ న్యాయ‌మా..? అంటూ రోజా, అంబ‌టి రాంబాబులు ప్ర‌శ్నించారు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే..  పుష్ప-2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఒక మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న హీరో అల్లు అర్జున్ థియేట‌ర్ వ‌ద్ద‌కు రావ‌డం వ‌ల్ల జ‌రిగింది. అయినా, ఆ ఘ‌ట‌న జ‌రిగింది తెలంగాణ‌లో.. అల్లు అర్జున్‌పై కేసు న‌మోదు చేసింది రేవంత్ స‌ర్కార్‌. కానీ  వైసీపీ నేత‌లు మాత్రం తెలంగాణ‌లో జ‌రిగిన‌ పుష్ప‌-2 ఘ‌ట‌న‌తో.. ప్ర‌స్తుతం రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌ను పోల్చ‌డంపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, మెగా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. వైసీపీ నేత‌లు కావాల‌నే రాజ‌కీయం చేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు.  మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఏపీలో ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ హీట్‌కు కార‌ణ‌మైంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.