తెలంగాణలో ఎన్నికల హీట్ ను తలపిస్తున్న రాజకీయ రణం

Publish Date:Nov 13, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార స్థాయిలో కొన‌సాగుతోంది. అధికార కాంగ్రెస్ తో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాగా త్వ‌ర‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అరెస్ట్ ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఈ మేర‌కు  మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇదే స‌మ‌యంలో రేవంత్ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ స‌రికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌ద‌కొండు నెల‌ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిందంటూ బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వ  అవినీతిపై పాల్ప‌డిందంటూ ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమ‌లులో విఫ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేలా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిజంగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తుందా..?  బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ స‌ర్కార్ ను ఇరుకు పెడుతుందా..? అనే అంశాల‌పై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది.

మాజీ మంత్రి కేటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 2023 ఫిబ్రవరిలో హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ జ‌రిగింది. ఈ రేసింగ్ లో భారీగా  ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రేవంత్ స‌ర్కార్ ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టి ఆధారాలు సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన  వాంగ్మూలం ప్రకారం రూ.55 కోట్ల నిధులను కేటీఆర్   ఆదేశాల మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ క్రింద కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో ముందుస్తుగా నెల రోజులు హైదరాబాద్ లో పోలీస్‌శాఖ 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఫైల్ ఇప్ప‌టికే సిద్దం చేసింద‌ని, మ‌రికొద్ది రోజుల్లోనే కేటీఆర్ అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెబుతూనే.. అరెస్టుకైనా   సిద్ధ‌మేన‌ని చెప్పారు.

కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న నేప‌థ్యంలో.. రేవంత్ స‌ర్కార్ కు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని విమ‌ర్శించిన కేటీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వం అవినీతిపై త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, అర్హ‌త లేక‌పోయినా శోదా కంపెనీకి టెండ‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని, త‌న బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి టెండ‌ర్ల‌ను అప్ప‌గించార‌ని అన్నారు. మొత్తం రూ. 8,888 వేల కోట్ల టెండ‌ర్ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి టెండ‌ర్లు ర‌ద్దు చేయాల‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ను కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీకి వెళ్లి  ఫిర్యాదు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని, త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వులు కూడా పోవ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణలో జ‌రుగుతున్న అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేటీఆర్,   డిమాండ్ చేస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంపై స్పందించ‌కుంటే  తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌టేన‌ని బ‌లంగా ప్ర‌చారం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది. 

కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌లు సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ స్ప‌దిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇస్తుండ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో జ‌రిగిన అవినీతిపై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌కుంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ క‌లిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాల‌ని చూస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేలా బీఆర్ఎస్ నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం అయ్యేలా దృష్టిసారించింది. డిసెంబ‌ర్ 1 నుంచి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బీజేపీ పాద‌యాత్ర‌లు చేప‌ట్ట‌నుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ అమలు చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు పాద‌యాత్ర‌ల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఈ రాజ‌కీయ చంద‌రంగంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌గ‌ల‌దా అనే అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.