తెలంగాణలో ఆట మొదలైంది !
Publish Date:Jul 5, 2022
Advertisement
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..అనేది పాత సామెత, మోడీ, షా జోడీ తలచుకుంటే, సీబీఐ,ఈడీ దాడులకు కొదవా అన్నది, కొత్త సామెత. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం, అదే అభిప్రాయంతో ఉన్నాయి. అదే ఆరోపణ చేస్తున్నాయి. సీబీఐ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలను ప్రయోగింఛి, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను మోడీ, షా జోడీ పడగొడుతున్నాయని.కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు ఎదుర్కోవడం కొత్త కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, సుప్రీం కోర్టు, సీబీఐని, ఏకంగా, కేంద్ర ప్రభుత్వం పలకమన్నపలుకులు పలికే, ‘పంజరంలో చిలక’ అని అభివర్ణించింది. అలాగే, ఇప్పడు మోడీ ప్రభుత్వం హయాంలోనూ, కేంద్ర దర్యాప్తు సంస్థలు అందుకుభిన్నంగా వ్యవహరించడం లేదు. ఈ మధ్యకాలంలోనే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సామాన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని ఐదారు రోజుల పాటు విచారించింది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. మహా రాష్ట్రలో మహ వికాస్ అఘాడీ (ఎంవిఎస్) ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే కారణమని, అన్ని పార్టీలు ఆరోపించాయి. ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలలో ఇంతవరకు తొమ్మిది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు కులిపొయాయి. నిజానికి, మోడీ షా జోడీకి ఇదొక ఆటగా మారిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ ఆటలో ప్రతిపక్షపార్టీలు తక్కువ తిన్నాయా, అంటే లేదు. మహారాష్ట్ర విషయాన్నే తీసుకుంటే, 2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బీజేపీకి వచ్చిన (106) సీట్లలో కొంచెం అటూ ఇటుగా సగం సీట్లు (55) వచ్చిన శివసేన ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుపట్టి, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ’ లతో చేతులు కల్పింది. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా, మూడు పార్టీల కూటమి, మహా వికాస అఘాడీ (ఎంవిఎస్) ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పడు ఆ అఘాడీ ప్రభుత్వంలో అగాధంలో కూరుకుపోయింది. సో .. మహా రాష్ట్ర విషయంవరకు పొలిటికల్ జస్టిస్, పొయిటిక్ జస్టిస్ ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోవచ్చునని, టిట్ ఫర్ టాట్’ పడతిలోనే బీజేపీ శివసేనను చీల్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని బీజేపే అనుకూల మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూప్’ కు చెందిన రూ.96 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా, తెరాస సమావేశం నడుస్తున్న సమయంలోనే, రాష్ట్రం లోపలా వెలుపలా ఉన్న నామా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాబితాలో, ఇంకా పెద్ద చేపలే ఉన్నాయని అంటున్నారు. నామా తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుంది, అయన బాగోగులు చూసే, ఒక రాజ్యసభ సభ్యునితో పాటుగా. ఒక లేడీ ఎమ్మెల్సీ పై బీజేపీ దృష్టిసారించినట్లు సమాచారం. ఆ ఇద్దరికి సంబందించిన ఆస్తులు, వ్యాపారాలు, బినామీ వ్యవఝారలపై ఈడీ ఆరా తీస్తోందని, తెలుస్తోంది. ఈ ఇద్దరు నెక్స్ట్ టార్గెట్ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. నిజానికి, ఇందుకు సంబదించిన పక్కా సమాచారంతో సదరు ఎంపీ, ఎమ్మెల్సీలను తెరాస నాయకత్వం అప్రమత్తం చేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు దేశంలో ఉన్నారా, లేదా అనే విషయంలోనూ అనుమానాలున్నాయని అంటున్నారు. అదే నిజమైతే, తెలంగాణలోనూ మోడీ, షా జోడీ అసలు అట మొదలైందని అనుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు, తెరాస సర్కార్’ను కూల్చే ప్రయత్నం జరగక పోయినా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బీజేపీకి 20- 30 సీట్లు వచ్చినా, ఆ తర్వాత, మహా రాష్ట్ర తరహాలో మూడు పార్టీల (తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, ఆ ప్రభుత్వం మనుగడ ముడునాళ్ళ ముచ్చటే అవుతుందని, బీజేపీ ప్రస్తుతం అదే వ్యూహంతో అడుగులు వేస్తోందని అంటున్నారు.
సరే, అది వేరే విషయం’ ఇప్పడు మోడీ షా నజర్, తెలంగాణ మీద పడింది. అయితే, మహారాష్ట్ర టైపులో ఇప్పటి కిప్పుడే తెరాస ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయక పోవచ్చును, కానీ, 2023 ఎన్నికలకు ముందు తెరాస ఆర్థిక ములాలపై దెబ్బకొట్టడం ఖయామని, అంటున్నారు. అంతే కాదు, అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్’ వర్క్ తెరాస ఎంపీ నామా నామా నాగేశ్వరరావు ఆస్తుల జప్తుతో మొదలైందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/political-game-started-in-telangana-39-139118.html





